మూసీకి ఇరువైపులా రెయిలింగ్.. వరదల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం

భారీ వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తూ.. హైదరాబాద్ నగరంలో పలు జనావాలను అతలాకుతలం చేస్తున్న మూసీ నదికి ఇరువైపు రెయిలింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మూసీకి ఇరువైపులా రెయిలింగ్.. వరదల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం
Follow us

|

Updated on: Oct 18, 2020 | 3:18 PM

Railing construction for Musi river: భారీ వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తూ.. హైదరాబాద్ నగరంలో పలు జనావాలను అతలాకుతలం చేస్తున్న మూసీ నదికి ఇరువైపు రెయిలింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని మూసీ రివర్ బోర్డు ఛైర్మెన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఉప్పొంగుతున్న మూసీ నదిని మొత్తం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నామని, దాని ఆధారంగానే నదికి ఇరువైపులా రెయిలింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని సుధీర్ రెడ్డి తెలిపారు.

వరద ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి మూసీ నది ఎక్కువ ప్రవహిస్తుందని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మూసికి ఇరువైపులా పటిష్టమైన రెయిలింగ్ నిర్మించాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. టీవీ9 ఛానల్‌తో సుధీర్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. మూసి ప్రవాహం తగ్గిన తర్వాత నదిపై ఉన్న బ్రిడ్జిల కండిషన్ చెక్ చేసి రాకపోకలు పునరిద్దిస్తామని ఆయన చెబుతున్నారు.

మూసీ నదిలో వరద పోటెత్తడంతో చాదర్‌ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జిలు దెబ్బతిని వుంటాయని సుధీర్ రెడ్డి చెబుతున్నారు. వరద తగ్గితేగానీ వాటి పరిస్థితి ఏంటన్నది అంఛనా వేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నిపుణల కమిటీ అధ్యాయం చేస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు సుధీర్ రెడ్డి. రెయిలింగ్ నిర్మాణం వల్ల నది ఆక్రమణలు తగ్గుతాయని, అదే సమయంలో వరద పోటెత్తినా జనావాసాల్లోకి వరద నీరు రాదని ఆయన వివరించారు.

Also read: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్

Also read: గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు

Also read: దివ్యాంగ బాలికను చెరిచి, చంపేసిన కజిన్ బ్రదర్

Also read: మూసీని రక్షించకపోతే భవిష్యత్తు లేదు… పర్యావరణవేత్తల వార్నింగ్