Breaking News
  • విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన రెండవ రోజు దసరా ఉత్సవాలు. రెండవ రోజు బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఉదయం 5 గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్న ఆలయ అధికారులు. విఐపి లకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు దర్శనాలకు అనుమతి.
  • తిరుమల: నేడు మూడో రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఉదయం 9గంటలకు సింహ వాహనంపై కొలువుదీరనున్న మలయప్పస్వామి. కరోనా ప్రభావంతో ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలు. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.
  • మరోసారి తెరపైకి ఓబుళాపురం మైనింగ్ వ్యవహారం. ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో అక్రమ మైనింగ్ తో పదేళ్ల క్రితం సంచలనం. ఓబుళాపురం గ్రామ సమీపంలోని మైనింగ్ ప్రాంతంలో భారీ అక్రమాలు. అనుమతులకు మించి మైనింగ్ చేసి.. కోట్లు కొల్లగొట్టినట్టు గాలి జనార్ధన్ రెడ్డిపై ఆరోపణలు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ... ప్రస్తుతం కోర్టులో నడుస్తున్న కేసు. ఇరు రాష్ట్రాల సరిహద్దులను సైతం ధ్వంసం చేసి మైనింగ్ చేసిన పలు కంపెనీలు. దీంతో ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం. సుప్రీం కోర్టుకు వెళ్లిన ఇరు రాష్ట్రాలు.. అనేక సార్లు సర్వేలు.. తేలని పంచాయతీ. సుప్రీం కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సర్వే ఆఫ్ ఇండియా. తాజాగా ఇరు రాష్ట్రాల సరిహద్దులను గుర్తించే పనిలో సర్వే ఆఫ్ ఇండియా.
  • అమరావతి: ఇవాళ బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన. 56 బిసి కార్పొరేషన్ల చైర్మన్, డైరెక్టర్ల పేర్లు ప్రకటించనున్న ప్రభుత్వం. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు. 30వేల పైబడి జనాభా కలిగిన బిసి కులాలకు కార్పొరేషన్లలో ప్రాతినిధ్యం . పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. పురుషులుకన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలకు ఛైర్మన్‌ పదవులు దక్కే ఛాన్స్.
  • అంగట్లో కరోన కీట్స్: టీవీ9 స్ట్రింగ్ ఆపరేషన్ లో బయట పడ్డ వాస్తవాలు. ప్రభుత్వ అనుమతి ఉన్న ప్రవేట్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ సెంటర్స్ లో మాత్రమే కరోన టెస్ట్ చేయాలి అని రూల్స్ ఉన్న భేఖాతారు చేస్తున్న వైనం. నూజివీడు లో ఓ ఫాన్సీ స్టోర్ లో కరోన కీట్స్ అమ్ముతున్న వైనం. ఇంటికి వచ్చి మరి టెస్ట్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ లేని టెక్కునిషియన్స్..ppe కీట్స్ కూడా వేసుకోకుండా ప్రభుత్వ రికార్డ్స్ లో కూడా పెట్టకుండా చేస్తున్న కరానా టెస్ట్ లు . కేస్ నమోదు చేసిన పోలీస్ లు విచారణ జరుపుతున్న నూజివీడు తహలసిల్దార్ సురేష్ కుమార్. ఫాన్సీ స్టోర్ యజమానికి కీట్స్ ఎవరు సప్లై చేస్తున్నారు విచారణ తెలలి.
  • టీవీ9 తో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రాంమోహన్. రాత్రి పడిన వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయి. Ghmc అన్ని శాఖల సిబ్బందిని అలెర్ట్ చేసాము. అర్ధరాత్రి నుండి కంట్రోల్ రూమ్ లో అధికారులు అందుబాటులో ఉన్నారూ. 19 రెస్క్యూ టీమ్స్ అలుపెరుగకుండా పని చేస్తున్నాయి. ఇంకా రిస్కు టీమ్స్ కానీ ,ఇతర సిబ్బందిని కానీ పెంచుతాము. వాటర్ లగింగ్ సెంట్రల దగ్గర ప్రత్ర్యక ద్రుష్టి పెట్టి చర్యలు చెప్పటం. నిరాశ్రయులన వారికి ప్రభుత్వ జి వో తో ని ఇళ్లను ఏర్పాటు చేస్తాం. తక్షణ సహాయం కోసం ఫుడ్,వాటర్ ,బ్లాంకెట్స్ ని అందజేస్తున్నాం. ప్రజలు బయపడవొద్దు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మూడు రోజుల పాటు వర్షం ఇలాగే ఉంటుందని చెప్తున్నారు. మేము అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
  • వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చెoదుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన జి హెచ్ ఎం సి యంత్రాంగం. సహాయక చర్యలను ముమ్మరం చేసిన జి హెచ్ ఎం సి. సహాయక చర్యలపై జి హెచ్ ఎం సి యంత్రాంగంకు దిశానిర్దేశం చేస్తున్న పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు. సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో తిరిగి మానిటరింగ్ చేస్తున్న కమీషనర్, జోనల్ కమీషనర్లు,అదనపు కమీషనర్లు, డిప్యూటీ కమీషనర్లు. పంపులు ఏర్పాటు చేసి కాలనీలు,సెల్లార్లలో నిలిచిన నీటిని బయటకు పంపింగ్ చేస్తున్న ఇంజనీరింగ్, డి ఆర్ ఎఫ్ సిబ్బoది. రోడ్లపై నిలిచిన నీటిని క్లియర్ చేస్తున్న సిబ్బంది. వరదతో రోడ్లు,నాలాల్లోకి కొట్టుకువచ్చిన చెత్త, చెదారం,భవన నిర్మాణ,శిధిల వ్యర్ధాల తొలగింపుకు కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్. అంటువ్యాదుల నివారణ కై వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి, యాంటీ లార్వా, సోడియం హైపో క్లోరైట్ క్రిమిసంహారకాలను స్ప్రే చేస్తున్న ఎంటమాలజి, డి ఆర్ ఎఫ్.ఫైర్ సర్వీసెస్ సిబ్బంది.

దివ్యాంగ బాలికను చెరిచి, చంపేసిన కజిన్ బ్రదర్

గుజరాత్‌లో దారుణం జరిగింది. పన్నెండేళ్ళ దివ్యాంగ బాలికపై వరసకు సోదరుడయ్యే యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం దారుణంగా తల నరికి హత్య చేశాడు.

Minor girl raped by cousin, దివ్యాంగ బాలికను చెరిచి, చంపేసిన కజిన్ బ్రదర్

Minor and specially able girl raped by cousin brother: గుజరాత్‌లో దారుణం జరిగింది. పన్నెండేళ్ళ దివ్యాంగ బాలికపై వరసకు సోదరుడయ్యే యువకుడు అత్యాచారం చేశాడు. అనంతరం దారుణంగా తల నరికి హత్య చేశాడు. తల లేని మొండాన్ని కనుగొన్న పోలీసులు కూపీ లాగగా… ఈ దారుణానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి.

గుజరాత్ రాష్ట్రంలోని బనస్కంత జిల్లా దంతివాడ ఏరియాలో ఓ దివ్యాగురాలైన పన్నెండేళ్ళ బాలికపై అత్యాచారం, హత్యోదంతం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోతిభఖర్ గ్రామ సమీపంలో పోలీసులు తల లేని బాలిక మొండాన్ని కనుగొన్నారు. దానికి 24 గంటల ముందే దివ్యాంగురాలైన ఓ బాలిక కనిపించడం లేదని దంతివాడ పోలీసులకు ఫిర్యాదు అందింది.

బాలిక గురించి వెతుకులాట ప్రారంభించిన పోలీసులకు మోతిభఖర్ గ్రామ శివారుల్లో ముందుగా తల లేని మొండెం కనిపించింది. దానికి మరికొద్ది దూరంలో తలను పోలీసులు కనుగొన్నారు. ఐడెంటిఫై చేసేందుకు బాలిక బంధువులను పిలిపించగా.. వారు ఆమెను తప్పిపోయిన దివ్యాంగ బాలికగా గుర్తించారు.

అనంతరం దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. సమీపంలోని పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దాంట్లో బాలికకు సోదర వరసయ్యే 25 ఏళ్ల నితిన్ మాలి ఆమెను తన బైక్‌ మీద తీసుకువెళుతూ కనిపించాడు. పోలీసులు తమదైన శైలిలో ఆ యువకుడిని విచారించారు. దాంతో నితినే ఆ బాలికపై అత్యాచారం చేసి.. తీరా విషయం అందరికీ తెలుస్తుందనే భయంతో ఆమెను దారుణంగా తలనరికి చంపేసినట్లు అంగీకరించాడని దీసా ఏరియా డీఎస్పీ డా.కుశల్ ఓజా చెబుతున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించిన పోలీసులు.. నితిన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుండగా.. బాధితురాలి కుటుంబీకులను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాజుల్‌బెన్ దేశాయ్ పరామర్శించారు. పెరుగుతున్న అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్

Also read: గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు

Related Tags