Mahesh Babu: మరో రికార్డ్ ను క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా…..
టాలీవుడ్ అగ్రహీరోల్లో స్టార్ హీరో మహేష్ బాబు ఒకరు. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే మహేష్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచున్నాడు.
Mahesh Babu: టాలీవుడ్ అగ్రహీరోల్లో స్టార్ హీరో మహేష్ బాబు ఒకరు. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే మహేష్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడీ అమ్మాయిల కలల రాకుమారుడు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబూ నటించిన మహర్షి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఏకంగా జాతీయ అవార్డును కూడా సాధించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు.
ఇక ఈ సినిమాఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా టీవీలో ఎనిమిది సార్లు టెలికాస్ట్ అయ్యింది. ప్రసారం అయిన ప్రతిసారి ఈ సినిమా టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంది. తాజాగా మరో సారి ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ కాగా మహర్షి 4.92 టిఆర్పీని తెచ్చుకుని రికార్డ్ క్రియేట్ చేయటం అంతటా విశేషంగా చెప్పుకుంటున్నారు. ఓ సినిమా తొమ్మిది సార్లు ప్రసారం అయ్యి కూడా ఇంత రేటింగ్ను తెచ్చుకుందంటే మామూలు విషయం కాదు. ఇక మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సర్కారు వారిపాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఏ ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే దుబాయ్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా. ఇప్పుడు హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Actress Sameera Reddy : సోనూసూద్, అర్జున్ రాంపాల్.. తాజాగా సినీనటి సమీరారెడ్డికి కరోనా పాజిటివ్