నిశ్శబ్దం.. అభిమానికి సారీ చెప్పిన మాధవన్‌

అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ నెల 2న ఓటీటీలో విడుదలైన

  • Tv9 Telugu
  • Publish Date - 3:43 pm, Sat, 10 October 20
నిశ్శబ్దం.. అభిమానికి సారీ చెప్పిన మాధవన్‌

Madhavan sorry to fan: అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ నెల 2న ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి. మంచి నటీనటులు ఉన్నప్పటికీ, కథలో లోపం వలన సినిమా అంత మెప్పించలేకపోయిందంటూ కొంతమంది విశ్లేషకులు కామెంట్లు పెట్టారు.

ఇదిలా ఉంటే ఇటీవల అభిమానులతో ముచ్చటించిన మాధవన్‌కి నిశ్శబ్దం గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాధవన్ సారీ చెప్పారు. నిశ్శబ్దంలో ఫ్లాష్‌బ్యాక్ అంతగా మెప్పించలేదు. నువ్వు ఏమంటావు అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. నేను అందుకు సారీ మాత్రమే చెప్పగలను అని కామెంట్ పెట్టారు. ఇక మరో నెటిజన్.. నిశ్శబ్దానికి నువ్వు ఎలా ఓకే చెప్పావు. కథ నీకు నచ్చిందా..? లేక మీకు చేయాలనిపించి చేశారా..? ఈ మూవీ అంత గొప్పగా ఏం లేదు. ఏ కోణంలో మీరు ఈ మూవీ చేశారనుకోవచ్చు..? అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన నటుడు.. ఒక్కోసారి మనం గెలుస్తూ ఉంటాము, ఒక్కోసారి ఓడిపోతాం. ఏదైనా మనం మన బెస్ట్‌ని ఇవ్వాలి అని కామెంట్ పెట్టారు.

Read More:

జక్కన్నపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ ఫిర్యాదు.. బాధ మొత్తం కక్కేసిన ఎన్టీఆర్, చెర్రీ

హెచ్చరిక.. పెళ్లి కాని మగవారికి కరోనా మరణం ముప్పు ఎక్కువ..!