AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: ‘మా’ ఎన్నికలకు రంగం సిద్ధం.. నోటిఫికేషన్ వచ్చేసింది. పోలింగ్ ఎప్పుడంటే..

MAA Elections 2021: 'మా' అధ్యక్ష ఎన్నికలు ఎంత హాట్‌టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ ఎన్నికలను సైతం తలపించిన ఈ ఎలక్షన్స్‌కు సంబంధించి ఎట్టకేలకు అధికారిక..

MAA Elections 2021: 'మా' ఎన్నికలకు రంగం సిద్ధం.. నోటిఫికేషన్ వచ్చేసింది. పోలింగ్ ఎప్పుడంటే..
Prakash Raj vs Manchu Vishnu
Narender Vaitla
|

Updated on: Sep 18, 2021 | 4:31 PM

Share

MAA Elections 2021: ‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఎంత హాట్‌టాపిక్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణ ఎన్నికలను సైతం తలపించిన ఈ ఎలక్షన్స్‌ తేదీకి సంబంధించి ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (2021 – 2023) ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అక్టోబర్‌ 10 (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

ఎన్నికల షెడ్యూల్‌ విషయానికొస్తే.. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్‌ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన. అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించి అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. ‘మా’ ఎన్నికల పోటీకి నియమ నిబంధనలు ఇలా ఉన్నాయి. ఒక అభ్యర్థి ఒక పోస్ట్‌ కోసమే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదు. 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్‌ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారని తెలిపారు.

ఇదిలా ఉంటే సాధారణ ఎన్నికలను తలపిస్తోన్న మా ఎన్నికలు ఈసారి మరింత రసవత్తరంగా సాగనున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా.. ఈసారి అధ్యక్ష పదవికి పోటి చేస్తున్న అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీపీఎల్‌ నర్సింహారావు మధ్య అసలైన పోటీ జరుగుతుండగా.. అనూహ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుని బరిలోకి బండ్ల గణేష్ రావడం చర్చనీయాంశంగా మారింది. మరి ‘మా’ అధ్యక్ష పీఠాన్ని ఎవరు అదిరోహిస్తారో తెలియాలంటే అక్టోబర్‌ 10 వరకు వేచి చూడాల్సిందే.

Also Read: సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి

కాల్చిన వెల్లుల్లిలో అద్భుత ఔషధ గుణాలు..! పాలతో కలిపి తీసుకుంటే ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..

Viral Video: వీరిని తిట్టడానికి పదాలు కూడా చాలవు.. పిల్లలు తినే వాటిపై కాలు వేసి ఎలా తొక్కుతున్నారో చూడండి.!