AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కొవిడ్ పరీక్షలకే మా డబ్బులన్నీ ఖర్చయిపోయాయి.. కరోనా కష్టాలను పంచుకున్న బుల్లితెర బ్యూటీ..

రెండేళ్ల క్రితం పుట్టిన కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వీడడం లేదు.  ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది.  సామాన్యులతో పాటు  సెలబ్రిటీలకు కూడా శారీరకంగా, మానసికంగా సమస్యలు సృష్టిస్తూనే ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్

Coronavirus: కొవిడ్ పరీక్షలకే మా డబ్బులన్నీ ఖర్చయిపోయాయి.. కరోనా కష్టాలను పంచుకున్న బుల్లితెర బ్యూటీ..
Basha Shek
| Edited By: |

Updated on: Jan 21, 2022 | 8:01 AM

Share

రెండేళ్ల క్రితం పుట్టిన కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వీడడం లేదు.  ఏదో విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది.  సామాన్యులతో పాటు  సెలబ్రిటీలకు కూడా శారీరకంగా, మానసికంగా సమస్యలు సృష్టిస్తూనే ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ  డెబీనా బెనర్జీ కి కూడా కరోనా కారణంగా ఎన్నో తంటాలు ఎదురయ్యాయట. గతంలో ‘అమ్మాయిలు- అబ్బాయిలు’, ‘సిక్స్’ చిత్రాలతో తెలుగు సినిమా ప్రియులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హిందీలో సీరియల్స్, రియాలిటీ షోల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. కాగా ఇటీవల  తన భర్త గుర్మీత్ చౌదరీతో కలసి లండన్ వెకేషన్ కు వెళ్లింది డెబీనా. అసలే కరోనా హాట్ స్పాట్ గా ఉన్న ఆ దేశంలో దంపతులిద్దరికీ  పరీక్షల రూపంలో వైరస్ సెగ  బాగాపూ తగిలిందట. ఈక్రమంలో ఇటీవల తమ పర్యటన ముగించుకువచ్చిన ఈ సెలబ్రిటీ కపుల్ యూట్యూబ్ ఛానెల్ వేదికగా తమ లండన్ ముచ్చట్లను పంచుకున్నారు.

‘ లండన్ పర్యటనలో భాగంగా మేం  కొవిడ్ పరీక్షల కోసం మేం వేలకు వేలు ఖర్చు పెట్టాం.  నాకు, నా భర్తకు కేవలం కరోనా టెస్టులకే   60 వేల రూపాయలు ఖర్చయ్యాయి.  ఇండియా నుంచి లండన్  కు వెళ్లగానే అక్కడి అధికారులు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపారు.  ఇందుకోసం ఇద్దరి నుంచి  30వేల రూపాయల చొప్పున వసూలు చేశారు.  ఇక తిరుగు ప్రయాణంలో భాగంగా లండన్‌లో విమానం ఎక్కేటప్పుడు కూడా మళ్లీ టెస్టులు నిర్వహించారు. అక్కడ కూడా ఒక్కొక్కరికి  రూ. 15 వేలు తీసుకున్నారు. అలా మొత్తం మీద నాలుగు కోవి డ్ టెస్టులకిగానూ  రూ. 60 వేలను ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఇక   కరోనా నెగెటివ్ రిపోర్ట్ లేకుండా ముంబైలోని మెయిన్ గేట్ నుంచి మమ్మల్ని బయటకు వెళ్లనీయలేదు’ అని డెబీనా దంపతులు తెలిపారు. 

Also Read: Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..

Massive 555-Carat Black Diamond: ఆకాశంలోంచి ఊడిపడిన బ్లాక్ డైమండ్.. అతి పెద్ద నల్ల వజ్రం స్పెషాలిటీ ఏంటంటే..(వీడియో)

Massive 555-Carat Black Diamond: ఆకాశంలోంచి ఊడిపడిన బ్లాక్ డైమండ్.. అతి పెద్ద నల్ల వజ్రం స్పెషాలిటీ ఏంటంటే..(వీడియో)