అత్యంత సంపన్నుడైన లెజెండరీ సింగర్ హఠన్మరణం.. నిద్రలోనే అనంతలోకాలకు!

ప్రముఖ అమెరికన్ సింగర్, గేయ రచయిత జిమ్మీ బఫ్ఫెట్ (76) శుక్రవారం (సెప్టెంబర్ 1) కన్నుమూశారు. సెప్టెంబర్ 1 రాత్రి నిద్రలోనే ఆయన మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. జిమ్మీ మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. శుక్రవారం రాత్రి తన కుటుంబం, స్నేహితులతో సరదాగా..

అత్యంత సంపన్నుడైన లెజెండరీ సింగర్ హఠన్మరణం.. నిద్రలోనే అనంతలోకాలకు!
Singer Jimmy Buffett
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 03, 2023 | 10:49 AM

ప్రముఖ అమెరికన్ సింగర్, గేయ రచయిత జిమ్మీ బఫ్ఫెట్ (76) శుక్రవారం (సెప్టెంబర్ 1) కన్నుమూశారు. సెప్టెంబర్ 1 రాత్రి నిద్రలోనే ఆయన మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. జిమ్మీ మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. శుక్రవారం రాత్రి తన కుటుంబం, స్నేహితులతో సరదాగా గడిపారు. చివరి శ్వాస వరకూ ఆయన ఆయన జీవితం ఓ పాటలాగే సాగిపోయింది. సింగర్ జిమ్మీ బఫ్ఫెట్ మరణ వార్త తెలియగానే పలువురు సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా జిమ్మీ బఫెట్ 1946, డిసెంబర్ 25వ తేదీన అమెరికాలోని మిసిసిపీలో జన్మించారు. తన 50 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 27 స్టూడియో ఆల్బమ్‌లను విడుదల చేశాడు. 1977లో విడుదలైన ‘మార్గరెట్ విల్లే’ ఆల్బమ్ ఆయన కెరీర్‌లో బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఇక సిమ్మీ బఫెట్ గాయకుడిగా మాత్రమే కాకుండా మంచి రచయిత కూడా. అతను రచించిన పుస్తకాలలో అత్యంత అధికంగా అమ్ముడయిన పుస్తకాలు కూడా ఉన్నాయి. రెండు పిల్లల పుుస్తకాలు కూడా రచించాడు. ఆయనకు సొంతంగా మార్గరీటవిల్లే రికార్డ్స్ లేబుల్ కూడా ఉంది. అంతేకాకుండా పలు సినిమాలు, టీవీ షోలలో అతిథి పాత్రలో కనిపించారు. 1981లో మాజీ ఫ్లోరిడా గవర్నర్ రాన్ గ్రాహంతో కలిసి సేవ్ ది మనటీ క్లబ్ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించారు.

ఇవి కూడా చదవండి

గార్డియన్ ప్రకారం.. మిస్టర్ బఫెట్ 2016లో ఫోర్బ్స్ అమెరికా సంపన్నుల జాబితాలో550 మిలియన్ డాలర్ల నికర ఆస్తులతో 13వ స్థానంలో నిలిచారు. 2023లో బఫ్ఫెట్ నికర ఆస్తి విలువ 1 బిలియన్‌ డాలర్లు పేర్కొంది. జిమ్మీ బఫ్ఫెట్ కు భార్య ముగ్గురు సంతానం (ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు) ఉన్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం
'యువకుల మృతి కలచివేస్తోంది'.. బాధిత కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం