ప్రభాస్- ఓమ్ రౌత్ ‘ఆది పురుష్’.. సీతగా మహేష్ హీరోయిన్ ఖరారు.. త్వరలోనే అధికారిక ప్రకటన
ఓమ్ రౌత్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'ఆది పురుష్'. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా
Prabhas Kriti Sanon: ఓమ్ రౌత్ దర్శకత్వంలో రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆది పురుష్’. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపిస్తున్నారు. అయితే సీత పాత్రకు గానూ చాలా మంది పేర్లే వినిపించాయి. అందులో అనుష్క శెట్టి, కియారా అద్వానీ, అనుష్క శర్మ, కీర్తి సురేష్, అనన్యా భట్.. ఇలా చాలా మంది హీరోయిన్ల పేర్లు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. (‘ఛలో ఢిల్లీ’.. తమపైకి టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించినా.. పోలీసుకు దాహం తీరుస్తున్న రైతు.. వీడియో వైరల్)
అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో సీత పాత్రకు కృతి సనన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే కృతికి ఇదో బిగ్ ఆఫర్ అవుతోంది. ఇక ప్రముఖ నటుడు అంగద్ బేడీ రావణాసురుడి కుమారుడు ఇంద్రజిత్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. (ఇప్పుడు ఇక్కడ ఉన్నాము.. కానీ ఏదో ఒక రోజు పోతాము.. వైరల్‌గా మారిన జవాన్ చివరి మాటలు)
కాగా 3డీలో ఓమ్ రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందుకోసం ప్రముఖ టీసిరీస్ నిర్మాణ సంస్థ దాదాపు 400 కోట్లు ఖర్చు చేయబోతుండగా.. అవతార్‌కి పనిచేసిన వీఎఫ్‌ఎక్స్ టీమ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ మూవీ కోసం కాస్త సన్నబడ్డ ప్రభాస్.. త్వరలోనే వర్కౌట్లను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ.. 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. (ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ.. ఆ ముగ్గురి పాత్రలు సమానంగా ఉండనున్నాయట.. అంతేకాదు..!)