AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arya- Sayyeshaa: టైటానిక్ ఫోజులో రొమాంటిక్ కపుల్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..

కోలీవుడ్ లో ప్రేమించుకుని పెళ్లిపీటలెక్కిన జంటల్లో హీరో ఆర్య (Arya), హీరోయిన్ సయేషా (Sayyeshaa) జోడీ ఒకటి.  'గజనీకాంత్' సినిమా షూటింగ్ లో మొదటిసారిగా కలుసుకన్న వీరిద్దరూ ఆ తర్వాత మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు.

Arya- Sayyeshaa: టైటానిక్ ఫోజులో రొమాంటిక్ కపుల్.. నెట్టింట్లో వైరల్ గా మారిన ఫొటో..
Basha Shek
|

Updated on: Jan 31, 2022 | 7:23 AM

Share

కోలీవుడ్ లో ప్రేమించుకుని పెళ్లిపీటలెక్కిన జంటల్లో హీరో ఆర్య (Arya), హీరోయిన్ సయేషా (Sayyeshaa) జోడీ ఒకటి.  ‘గజనీకాంత్’ సినిమా షూటింగ్ లో మొదటిసారిగా కలుసుకన్న వీరిద్దరూ ఆ తర్వాత మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆపై పెద్దల అనుమతితో 2019 మార్చిలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తమ ప్రేమ బంధానికి గుర్తుగా గతేడాది జులైలో పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు. కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియా(S0cial media) లోనూ చురుగ్గా ఉంటుంది సయేషా. తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలతో పాటు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అందులో పంచుకుంటుంది.

జాక్- రోజ్ ల మాదిరిగా..

కాగా ఈ జంట గతంలో వేకేషన్ లో భాగంగా స్పెయిన్ లోని బాలేరిక్ సముద్ర పరిధిలోని ఐలాండ్ ‘ఐబిజా’కు  వెళ్లారు.  అక్కడ ఓ బోటుపై సయేష- ఆర్య హాలీవుడ్ మూవీ ‘టైటానిక్’లోని ఐకానిక్ సీన్ ను రీక్రియేట్ చేశారు. జాక్ – రోజ్ జోడీ తరహాలో స్టిల్ ఇచ్చి అదరగొట్టారు. ఈ ఫొటోను  తన సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయింది సయేషా. తన భర్తతో కలిసి ఇలా సరదాగా గడపడం ఆనందంగా ఉందని అందులో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన  ‘అఖిల్’ సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించింది సయేషా. ఆతర్వాత బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో బిజీగా మారిపోయింది. ఆమె చివరిసారిగా దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘యువరత్న’ సినిమాలో నటించింది.  ఇక ఆర్య విషయానికొస్తే గతేడాది 4 సినిమాలతో మన ముందుకు వచ్చాడు . ‘టెడ్డీ’, ‘సార్పట్ట’, ‘ఆరణ్మణై 3’, ‘ఎనిమీ’ చిత్రాలతో తమిళ, తెలుగు సినిమా ప్రియులను అలరించాడు.

View this post on Instagram

A post shared by Sayyeshaa (@sayyeshaa)

Also Read: Anupama Parameshwaran: నెట్టింట్లో అనుపమ రచ్చ.. రాత్రి అంటే వైన్ ఉండాల్సిందేనంటున్న హీరోయిన్..

Naga Chaitanya: తమిళ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో..?

30 weds 21: మళ్లీ అలరించేందుకు సిద్ధమైన 30 వెడ్స్ 21.. రెండో సీజన్ కు రంగం సిద్ధం..