Naga Chaitanya: తమిళ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అక్కినేని యంగ్ హీరో..?
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఇటీవలే బంగార్రాజు సినిమాతో సక్సెస్ అందుకొని ఫుల్ జోష్ మీద ఉన్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
Naga Chaitanya: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఇటీవలే బంగార్రాజు సినిమాతో సక్సెస్ అందుకొని ఫుల్ జోష్ మీద ఉన్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున తో కలిసి నటించి ఆకట్టుకున్నాడు చైతన్య. గత ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న చైతన్య ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ మూవీ మనం సినిమా అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు థాంక్యూ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో చైతు హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమాలో అందాల భామ రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం రష్యాలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అక్కడ హీరో హీరోయిన్ ల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చైతన్య మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా తమిళ్ లో వచ్చిన మానాడు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో చైతన్య సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఆయన ఇటీవల చైతూను కలిసి కథ చెప్పడం .. చైతూ ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. మరో వైపు నాగ చైతన్యతో సినిమా చేయడానికి పరశురామ్, నందిని రెడ్డి, విజయ్ కనకమేడల సిద్ధంగా ఉన్నారు. అలాగే నాగచైతన్య వెబ్ సిరీస్ లు కూడా మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి : Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?