Cinema : రూ. 350 కోట్ల బడ్జెట్.. రూ. 100 కోట్ల కలెక్షన్.. స్టార్ హీరో సినిమా.. అయినా ఆస్తులు అమ్ముకున్న నిర్మాత..

సాధారణంగా భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్, భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. దీంతో నిర్మాతలకు సైతం నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

Cinema : రూ. 350 కోట్ల బడ్జెట్.. రూ. 100 కోట్ల కలెక్షన్.. స్టార్ హీరో సినిమా.. అయినా ఆస్తులు అమ్ముకున్న నిర్మాత..
Cinema

Updated on: Dec 10, 2025 | 9:21 AM

ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు ఏమాత్రం వెనుకాడడం లేదు. కానీ స్టార్ హీరో ఉన్నా ఎక్కువ పెట్టుబడితో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్లు పెట్టి తెరకెక్కించారు. కానీ ఆ మూవీ విఫలం కావడంతో నిర్మాత తన ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. ఇద్దరు పెద్ద స్టార్స్ అయినప్పటికీ కేవలం రూ.100 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో నిర్మాత దాదాపు రూ.200 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఆ సినిమా పేరు బడే మియాన్ చోటే మియాన్. హిందీలో నిర్మించిన మూవీ ఇది. 1998లో అమితాబ్ బచ్చన్, గోవింద నటించిన సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అయిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించార.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..

భారీ అంచనాల మధ్య 2024 రంజాన్ పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రూ. 350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 115 కోట్లు మాత్రమే వసూలు చేసింది. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకులు వాసు భంగ్నాని , జాకీ భంగ్నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం భారీ పరాజయం పాలైన తర్వాత, నిర్మాణ సంస్థ సిబ్బందికి చెల్లించలేకపోయిందని, కంపెనీ అప్పులు కూడా భారంగా మారాయని ప్రచారం నడిచింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..

వాసు పఘ్నాని తన రూ.250 కోట్ల అప్పు తీర్చడానికి పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన ఏడు అంతస్తుల కార్యాలయ భవనాన్ని విక్రయించాడని టాక్ వినిపించింది. అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. తన పేరుపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని వాసు భఘ్నని ఆరోపించాడు. కానీ ఈ సినిమా విషయంలో నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..