AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

70కి పైగా సినిమాలు.. రజినీకాంత్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్.. ఇప్పుడు ఆసుపత్రిలో డాక్టర్..

హీరోయిన్లు వెండితెరపై మెరవడం సర్వసాధారణం. కానీ, తన నటనా జీవితం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి, ఆ తర్వాత తన చదువు పూర్తి చేసి, పేదల కోసం ఒక ఆసుపత్రిని స్థాపించిన నటి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం అదే పని చేసింది. దక్షిణాది దిగ్గజాలతో కలిసి సుమారు డెబ్బై చిత్రాలలో నటించిన ఆ హీరోయిన్ పేదల కోసం స్వయంగా ఆసుపత్రిని నిర్మించింది.

70కి పైగా సినిమాలు.. రజినీకాంత్, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్..  ఇప్పుడు ఆసుపత్రిలో డాక్టర్..
Rupini
Rajitha Chanti
|

Updated on: Nov 10, 2026 | 5:43 PM

Share

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కొందరు నటీనటులు తమ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి, పూర్తిగా భిన్నమైన రంగాలను ఎంచుకుంటారు. అచ్చం అలాంటి కోవకే చెందుతారు తొంభైల కాలంలో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటి రూపినీ. రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి అగ్ర హీరోల సరసన నటించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆమె, ఇండస్ట్రీని వీడి ఒక ఆసుపత్రిని స్థాపించి వైద్యురాలిగా సేవలు అందిస్తున్న వైనం ఎంతో స్ఫూర్తిదాయకం. అసలు పేరు కోమల్ మహువాకర్ (Komal Mahuvakar) అయిన రూపినీ, ముంబైలో జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ లాయర్ కాగా, తల్లి డైటీషియన్‌గా పనిచేశారు. చిన్నతనం నుంచే భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ వంటి నృత్యరీతులలో శిక్షణ పొందిన ఆమెకు నటి కావాలనే కోరిక కంటే మంచి నర్తకి కావాలనే కల ఉండేది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు హృషికేష్ ముఖర్జీ దృష్టిలో పడిన ఆమె, అమితాబ్ బచ్చన్ నటించిన ‘మిల్లీ’ (1975) చిత్రంలో బాలనటిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత హిందీలో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ అక్కడ పెద్దగా గుర్తింపు లభించలేదు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆమె తన పేరును ‘రూపినీ’గా మార్చుకున్నారు. తెలుగు, తమిళ, మరాఠీ, కన్నడ , మలయాళ భాషల్లో నటించి స్టార్ డెబ్యూలను సొంతం చేసుకున్నారు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసి ‘కూలిక్కారన్’, ‘మనితన్’, కమల్ హాసన్‌తో ‘అపూర్వ సహోదరులు’, ‘మైఖేల్ మదన కామ రాజన్’, అలాగే మోహన్‌లాల్, మమ్ముట్టి, వెంకటేష్ (ఒంటరి పోరాటం) వంటి దిగ్గజ హీరోల సరసన నటించి దాదాపు 70కి పైగా చిత్రాల్లో కథానాయకగా మెరిశారు. గ్లామర్‌తో పాటు చక్కటి అభినయంతో ఆమె తక్కువ కాలంలోనే సౌత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

కెరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో 1995లో ప్రముఖ వ్యాపారవేత్త మోహన్ కుమార్‌ను వివాహం చేసుకున్న రూపినీ, ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. చిన్నప్పటి నుంచి తనకంటూ ఉన్న వైద్య రంగంపై మక్కువతో ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ‘యూనివర్సల్ హార్ట్ హాపిటల్’ (Universal Heart Hospital) ను స్థాపించారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఒక డాక్టర్‌గా సమాజ సేవలో తరించాలని నిర్ణయించుకోవడం నిజంగా అభినందనీయం. సుదీర్ఘ విరామం తర్వాత 2020లో వచ్చిన ‘చిథి 2’ (Chithi 2) అనే తమిళ సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చిన రూపినీ, ప్రస్తుతం తన కుటుంబ జీవితాన్ని, వైద్య వృత్తిని సమన్వయం చేసుకుంటూ నిశ్శబ్దంగా జీవితాన్ని గడుపుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

హీరోయిన్ రూపిణి..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us