Renu Desai: ఒక వ్యక్తి కష్టంలో ఉంటే.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్..
టాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక విషయంపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. అలాగే అకీరా నందన్, ఆద్యకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సమాజంలో కష్టాలు ఎదుర్కోనే మనుషులు.. వారి పట్ల చూపాల్సిన మానవత్వం గురించి వెల్లడించింది.

టాలీవుడ్ నటి రేణు దేశాయ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు కథానాయికగా అలరించిన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కీలకపాత్రలు పోషిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. తాజాగా ఆమె తన ఇన్ స్టా వేదికగా చేసిన తాజా పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సమాజంలో మనుషులు ఎదుర్కొనే కష్టాలు, తోటివారి పట్ల మానవత్వం చూపాల్సిన అవసరం గురించి ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి విమర్శించడం, వారిని మరింత మానసిక క్షోభకు గురిచేయడం, కింద పడిపోయిన వాళ్లను తొక్కడం చాలా అమానుషమని అన్నారు. వాళ్లు ఏ స్థాయిలో ఉన్నా వాళ్లు కూడా ఒక మనిషే అని గుర్తించాలని.. మన ఇళ్లు బాగాలేనప్పుడు ఇతరుల ఇళ్లపై రాళ్లు వేయొద్దని రాసుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ సంస్కృతి, విమర్శలపై పరోక్షంగా స్పందిస్తూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
“ఇప్పటికే కాస్త పడిపోయిన వాళ్లని తొక్కడం అమానుషం!. వాళ్ళు ఈ స్థాయీ లో ఉన్నా, వాళ్ళు కూడా ఒక మనిషి. ఒకరి సంతానం, ఒక పేరెంట్ ఓ, లేదా ఎవరైనా తోబుట్టువు అని మార్చిపోకూడదు. మనమే అసంపూర్ణమైన అద్దాల ఇళ్లలో నివసిస్తున్నప్పుడు దయచేసి ఇతరుల ఇళ్లపై రాళ్లు రువ్వకండి. మనమందరం మానవులం, తాదాత్మ్యం, దయ మానవులుగా పిలవబడే మొదటి ప్రాథమిక అవసరాలు! (నేను ఈ మాటలు రాశాను కాబట్టి మీ తెలివితక్కువ ఊహాగానాలు ప్రారంభించవద్దు ఎందుకంటే సమాజంగా మనం మంచిగా చేయగలమని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. లేదు, నేను దయగా, తెలివిగా ఉండటానికి ఏ పేటీయం నుంచి డబ్బులు అందుకోలేదు. ఇది కేవలం నా మనసులోని మాటలు మాత్రమే” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
ఇక సినిమాల విషయానికి వస్తే, వెండితెరకు కొంతకాలం దూరంగా ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకపాత్రలు ఎంచుకుంటున్నారు. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
రేణు దేశాయ్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
