AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla: ఉసిరి వీరికి విషంతో సమానం.. తినే ముందు కచ్చితంగా ఇది తెలుసుకోండి

ఉసిరి.. దీనిని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది దీనిని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే ఇది ప్రయోజనరకరమైనదే అయినప్పటికీ.. ఇది అందరిపై ఒకేలాంటి ప్రభావాన్ని చూపకపోవచ్చు. అవును కొన్ని రోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఉసిరి తినకపోవడమే మంచిదట. కాబట్టి ఇంతకూ ఉసరి ఎవరూ తినకూడదు.. ఉసిరి వల్ల ఉన్న దుష్ప్రబావాలేంటో చూద్దాం.

Anand T
|

Updated on: Nov 10, 2026 | 4:42 PM

Share
ఉసిరిని చాలా మంది సూపర్ ఫుడ్‌ అంటారు.. ఎందుకంటే దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన జుట్టు,చర్మంతో పాటు పూర్తి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని అనారోగ్యాల నుండి కాపాడతాయి.

1 / 5
ఉసిరి జుట్టుకు చాలా మేలు చేస్తుంది. దీనిని కేశ ఉత్పత్తులు, చికిత్సలలో ఉపయోగిస్తారు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టును బలపరుస్తుంది మరియు చుండ్రును తగ్గిస్తుంది. అంతేకాదు ఉసిరిలో చర్మ ఆరోగ్యానికి దోహదపడే ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యం ఇందులో కొల్లాజెన్ ఉంటుంది. ఇది ముడతలను తగ్గించి, మొటిమలను దూరం చేస్తుంది.

2 / 5
అంతేకాదు ఉరిలో ఉండే ఫైబర్ మలబద్ధకంతో పాటు, ఇది కడుపు సమస్యలను నివారిస్తుంది. అలాగే ఉసిరి గుండెకు కూడా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఇది డయాబెటీస్ ఉన్న వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.

3 / 5
అయితే వీటిని మితంగా తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ.. వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు,ఇతర కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఉసిరిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది, సున్నితమైన కడుపు ఉన్నవారు దీనిని తీసుకోవడం మంచిది కాదు.

4 / 5
ఉసిరిలో ఆక్సలేట్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. అలాగే ఉసిరి అంటే అలర్జీ ఉన్న వారు వీటిని దూరంగా ఉండాలి.. వీటిని తన్నప్పుడూ చర్మంపై దురద, స్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఇలా ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే తినడం ఆపేయండి. Note: పైన ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడింది. వీటిని Tv9 దృవీకరించడం లేదు.

5 / 5
Follow Us