‘కేజీఎఫ్ 2’.. సంజయ్ పాత్ర కోసం ‘ప్లాన్ బి’
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ కేజీఎఫ్ 2. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే విలన్‌గా నటిస్తున్నారు.
KGF 2 Sanjay Dutt: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ కేజీఎఫ్ 2. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే విలన్‌గా నటిస్తున్నారు. లాక్‌డౌన్ ముందు తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. అయితే ఈ లాక్‌డౌన్‌లో ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినట్లు తేలింది. పరిస్థితి బాలేకపోవడంతో విదేశాలకు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు.
మరోవైపు కేజీఎఫ్ 2 షూటింగ్ కూడా తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో సంజయ్ రాక కోసం కేజీఎఫ్ 2 టీమ్ చాలా ఎదురుచూస్తోంది. ఆయన కోలుకొని మళ్లీ షూటింగ్‌లోకి అడుగుపెడతాడని భావిస్తోన్న యశ్ టీమ్.. ప్రస్తుతం మిగిలిన వారిపై చిత్రీకరణను చేస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. ఆ లోపు సంజయ్ రాకపోతే.. ప్లాన్ బిని రెడీ చేసుకుందట. డూప్‌న పెట్టి మిగిలిన సన్నివేశాలను పూర్తి చేయాలని వారు అనుకుంటున్నారట.
కాగా కేజీఎఫ్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రవీనా టాండెన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అన్ని ఇండస్ట్రీల‌్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Read More: