AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: ఆకతాయిలు అల్లరి చేస్తున్నారంటూ ఫోన్.. ఒంటరిగా బైక్‌పై వెళ్లిన ఎమ్మెల్యే.. ఆ తర్వాత..

గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ ఒక ముఖ్యమైన కూడలి.. ఈ ప్రాంతంలో ఉన్నత వర్గాల వారు, ప్రముఖులు నివసిస్తుంటారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. గార్డెన్స్ లోని ఒక నిర్మానుష్య ఏరియాలో కొంతమంది ఆకతాయిలు చేరి అల్లరి చేస్తున్నారు. ప్రతి రోజూ ఇదే తంతు కొనసాగుతోంది.

Guntur: ఆకతాయిలు అల్లరి చేస్తున్నారంటూ ఫోన్.. ఒంటరిగా బైక్‌పై వెళ్లిన ఎమ్మెల్యే.. ఆ తర్వాత..
Mla Galla Madhavi
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 10:33 AM

Share

గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ ఒక ముఖ్యమైన కూడలి.. ఈ ప్రాంతంలో ఉన్నత వర్గాల వారు, ప్రముఖులు నివసిస్తుంటారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. గార్డెన్స్ లోని ఒక నిర్మానుష్య ఏరియాలో కొంతమంది ఆకతాయిలు చేరి అల్లరి చేస్తున్నారు. ప్రతి రోజూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆకతాయిలు అల్లరి స్థానికులకు ఇబ్బందిగా మారింది. గంజాయి సేవిస్తున్నట్లు స్థానికం అనుమానించారు. దీంతో ఆకతాయిలు అల్లరి, గంజాయి సేవించడంపై స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫోన్ చేసి చెప్పారు. ఆకతాయిలు అల్లరి స్థానికులకు న్యూసెన్స్ గా మారిన విషయాన్ని చెప్పేశారు. ఇక అంతటితో తమ పని అయిపోయిందని స్థానికులు గమ్మనుండిపోయారు.‌

అయితే ఫోన్ చేసిన పది నిమిషాలకే గల్లా మాధవి ఆ స్థలంలో వాలిపోయారు‌. బైక్ పై సర్రున దూసుకొస్తున్న ఎమ్మెల్యే ను చూసిన ఆకతాయిలు అక్కడి నుండి పారిపోయారు‌.‌ ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వచ్చిన విషయం క్షణాల్లోనే చేరిపోయింది. దీంతో ఎమ్మెల్యే కి ఫోన్ చేసిన మహిళా వచ్చి.. ఆకతాయిలు ఆట కట్టించాలని చెప్పింది. ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నిఘా పెట్టాలని సూచించింది. గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించింది.

వీడియో చూడండి..

ఫోన్ కాల్ కే స్పందించి వచ్చిన ఎమ్మెల్యే ను స్థానికులు అభినందించారు. గతంలోనూ పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో నిర్మానుష ప్రాంతానికి పోలీసులతో వెళ్ళి పేకాట రాయుళ్లు, గంజాయి ముఠాని పట్టించారు. సమస్యలున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆమె స్పందిస్తున్న తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది?
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి