Breaking News
  • దక్షిణ మహారాష్ట్ర, కొంకణ్‌ దగ్గర తీవ్ర అల్పపీడనం. ఈశాన్య అరేబియా సముద్రతీరంలో బలపడుతున్న వాయుగుండం. మరో నాలుగు రోజుల్లో అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం. నేడు, రేపు ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.
  • అమరావతి: స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ పై కీలక సర్కులర్ జారీ. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదు అని ఆదేశం . కొన్ని స్కూల్స్ లో విద్యార్థుల కుల, మత వివరాలు హాజరు లో నమోదు చేస్తున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే వాటిని తొలగించాలని సర్కులర్ జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్.
  • కూకట్ పల్లిలో దారుణం, స్నేహం ముసుగులో అత్యాచారం. జూబ్లీహిల్స్ కి చెందిన బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం. బర్త్ డే కేకు లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం . విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులు. తీవ్ర అస్వస్తతకి లోనవడంతో ఆస్పత్రిలో చేర్చిన తల్లిదండ్రులు. నిలదీయడంతో విషయం బయటపెట్టిన బాలిక. జోసెఫ్, రాము, నవీన్ ల పై కేసు నమోదు చేసిన తల్లిదండ్రులు.
  • గుంటూరు: జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న విజయవాడ తేజస్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు. కత్తితో పొడుచుకోవడంతో పొట్టలో తీవ్ర గాయం. పేగులలో బ్లీడింగ్ కావడంతో ఆపరేషన్ చేసిన జిజిహెచ్ వైద్యలు. నాగేంద్రబాబు ను ఐసియులో పెట్టి చికిత్స అందిస్తున్న వైద్యులు. ఇంకా స్పృహలోకి రాని నాగేంద్రబాబు. రెండు రోజులు గడిస్తే గాని నాగేంద్రబాబు పరిస్థితి చెప్పలేమంటున్న వైద్యులు.
  • అమరావతి: ఈరోజే దుర్గగుడి దగ్గర ప్లైఓవర్ ప్రారంభం . వీడియో కాన్ఫిరెన్సు ద్వారా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయ్యింది. బెజవాడ వాసుల చిరకాల కోరికను బిజెపి ప్రభుత్వం నెరవేర్చింది. దశాబ్దాలుగా విజయవాడ ప్రజలు ఎదురు చూస్తున్న కల సాకారమైంది. ఉదయం 11.30 ని.కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతులమీదుగా ఫ్లైఓవర్ ప్రారంభం కాబోతుంది. కరోనా కారణంగా వర్చ్యవల్ విధానంలో ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తారు .
  • ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు హైదరాబాద్‌:- ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్‌ కు 19.33 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
  • ఖమ్మం అత్యాచారం దాడి కేసులో బాలిక మృతి.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పదమూడేళ్ల బాలిక మృతి.. గత నెలలో బాలికపై అత్యాచారం చేసి దాడి చేసిన యువకుడు .. గాయాలపాలైన 13 ఏళ్ల బాలిక కు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స.. బాలిక పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ పదమూడేళ్ల బాలిక మృతి

Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. గెలిచిన మెహబూబ్

బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో లగ్జరీ టాస్క్‌లో భాగంగా  స్మిమ్మింగ్ పూల్‌లో ఉన్న రియల్ మ్యాంగో బాటిల్స్‌ని తెచ్చి దించకుండా తాగాలని బిగ్‌బాస్‌ వెల్లడించారు.

Bigg Boss 4 Luxury task, Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. గెలిచిన మెహబూబ్

Bigg Boss 4 Luxury task: బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో లగ్జరీ టాస్క్‌లో భాగంగా  స్మిమ్మింగ్ పూల్‌లో ఉన్న రియల్ మ్యాంగో బాటిల్స్‌ని తెచ్చి దించకుండా తాగాలని బిగ్‌బాస్‌ వెల్లడించారు. ఎవరు ఎక్కువ బాటిల్స్ తాగితే వాళ్లే విజేతలని తెలిపారు. ఇక ఈ ఆటలో కుమార్ సాయి-మెహబూబ్‌లు పోటీ పడ్డారు. బజర్ మోగేసరికి మెహబూబ్ ఏడు బాటిల్స్.. కుమార్ సాయి ఆరు బాటిల్స్ తాగారు. దీంతో మెహబూబ్ విజేత‌గా నిలిచాడు.

ఇక లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా మటన్, చికెన్, కాఫీ, గ్రీన్ టీలు హౌజ్‌లోకి వచ‌్చాయి. దీంతో వరద బాధితులకు పులిహోర పాకెట్లు లభించినట్టుగా కంటెస్టెంట్‌లు తెగ సంతోషపడ్డారు. చికెన్, మటన్ అంటూ ఆనందించారు. దివి ఎట్టకేలకు ఊడ్చుతుంటే అవినాష్, లాస్యలు గుసగుసలాడుతూ ఆమెపై కెప్టెన్ నోయల్‌కి కంప్టైంట్ ఇచ్చారు. మరోవైపు ఇంటి సభ్యులు స్ట్రెస్ రిలీఫ్ కోసం జెర్సీలో నాని అరిచినట్లు పిచ్చి పిచ్చిగా అరుస్తూ రచ్చ చేశారు. వాళ్ల పిచ్చిని చూసి స్టేజ్ 5 బ్రదర్ అని అభిజిత్‌ కామెంట్లు చేశారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే

Bigg Boss 4: సొహైల్ vs అరియానా.. ఊహించని ట్విస్ట్

Related Tags