మరో బాలీవుడ్ చిత్రంలో ‘మహానటి’

మరో బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జాతీయ అవార్డు గ్రహీత, ’హైదరాబాద్ బ్లూస్’ ఫేమ్ నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంలో నటించబోతుంది ఈ మహానటి. లేడి ఓరియెంటెడ్ కథాంశంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. రిలియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, టాలీవుడ్‌కు చెందిన మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుండగా.. […]

మరో బాలీవుడ్ చిత్రంలో ‘మహానటి’
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 06, 2019 | 4:57 PM

మరో బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు కీర్తి సురేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జాతీయ అవార్డు గ్రహీత, ’హైదరాబాద్ బ్లూస్’ ఫేమ్ నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రంలో నటించబోతుంది ఈ మహానటి. లేడి ఓరియెంటెడ్ కథాంశంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. రిలియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, టాలీవుడ్‌కు చెందిన మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

కాగా ‘మహానటి’ చిత్రంతో పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేశ్ ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ మూవీలో, రజనీ సరసన ఓ చిత్రంలో, తెలుగులో ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. అలాగే బదాయి హో దర్శకుడు అమిత్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కబోయే చిత్రం ద్వారా తొలిసారి బాలీవుడ్‌కు వెళ్లబోతుంది. క్రీడా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ నిర్మించనున్నాడు.