Kannada actor Darshan: టాలీవుడ్ పై కన్నడ హీరో గరంగరం.. కన్నడ ఫిలించాంబర్‌ను ఆశ్రయించిన నటుడు
కన్నడ సినిమా కేజీఎఫ్ టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో కన్నాడలోని పలు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి.
కన్నడ సినిమా కేజీఎఫ్ టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో కన్నాడలోని పలు సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు తెలుగులో రిలీజ్ కూడా అయ్యాయి మరి కొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో కన్నడ హీరో దర్శన్ తన తాజా చిత్రం ‘రాబర్ట్’ ని తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా మార్చి 11న విడుదల చేయాలనీ చూస్తున్నారు. అయితే తనసినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సహకరించడం లేదని దర్శన్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయానికి టాలీవుడ్ సినిమాలు నాలుగు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’.. మంచు విష్ణు-కాజల్ అగర్వాల్ ల ‘మోసగాళ్లు’.. శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్ ల ‘గాలి సంపత్’.. నవీన్ పొలిశెట్టి-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ కలసి నటించిన ‘జాతి రత్నాలు’ సినిమాలు శివరాత్రికి రిలీజ్ అవుతున్నాయి. దాంతో థియేటర్స్ సర్దుబాటు కాకపోవడంతో డిస్టిబ్యూటర్లు ముందుకు రావడంలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ‘రాబర్ట్’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి సహకరించడం లేదంటూ దర్శన్ కన్నడ ఫిలించాంబర్ ను ఆశ్రయించాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
‘Sultan’ Teaser : యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న కార్తి ‘సుల్తాన్’ .. ఆకట్టుకున్న టీజర్..