బాలీవుడ్ బ్యూటీకి దెబ్బ మీద దెబ్బ.. ఇప్పటికే కేసుల్లో చిక్కున్న కంగనా.. మరోసారి సమన్లు జారీ చేసిన కోర్టు..
బాలీవుడ్ నటి కంగనాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సుశాంత్ మరణం తర్వాత ఆమె ఏ కామెంట్ చేసినా పోలీసులు, మీడియా, కోర్టులు వెంటాడుతున్నాయి...

బాలీవుడ్ నటి కంగనాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సుశాంత్ మరణం తర్వాత ఆమె ఏ కామెంట్ చేసినా పోలీసులు, మీడియా, కోర్టులు వెంటాడుతున్నాయి. మతపరమైన ట్వీట్లు చేసినందుకు ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆమెపై వర్గ ద్వేషాలను రెచ్చగొట్టారన్న అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగామరోసారి కంగనా చిక్కుల్లోపడింది.
బాలీవుడ్‌లో ఒక కోటరీ ఉందని, అందువల్ల సినీరంగంలో కొత్తవాళ్లను ఎదగనివ్వరని, రచయిత జావేద్ అక్తర్ అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటూ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తీవ్ర ఆరోపణలు చేసింది కంగనా. ఈ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ అనే వ్యక్తి .. కంగనాపై పరువునష్టం దావా వేశారు. దీంతో విచారణలో భాగంగా పోలీసులు ఆమెను సంప్రదించగా ఆమె విచారణకు సహకరించలేదు. దాంతో జావేద్ ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Kannada actor Darshan: టాలీవుడ్ పై కన్నడ హీరో గరంగరం.. కన్నడ ఫిలించాంబర్‌ను ఆశ్రయించిన నటుడు