బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో.. రియల్ హీరో కోసం విలన్‌గా మారుతున్న స్టార్..
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విభిన్న సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ప్రస్తుతం చక్ర సినిమా షూటింగ్లో బిజీగా మారాడు ఈ యంగ్ హీరో.

Actor Vishal Entry in Bollywood: తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విభిన్న సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ప్రస్తుతం చక్ర సినిమా షూటింగ్లో బిజీగా మారాడు ఈ యంగ్ హీరో. ఇటీవలే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌కు విశేషస్పందన లభించింది. తాజాగా విశాల్ బాలీవుడ్ అరంగేట్రం చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సంచలన విషయం ఎంటంటే.. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కోనసాగుతున్న విశాల్.. హిందీలో మాత్రం అందుకు రివర్స్‌లో కనిపించనున్నాడట.
2018లో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఇరుంబు తిరాయ్’ సినిమా (తెలుగులో అభిమన్యుడు)ను హిందీలో రిమేక్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలోని హీరో విశాల్ పాత్రను రియల్ హీరో సోనూసూద్ పోషించనున్నాడని.. అలాగే.. .యాక్షన్ కింగ్ అర్జున్ పాత్రలో విశాల్ నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్‌ను ప్రకటించలేదు చిత్రయూనిట్. తమిళంలో సమంత హీరోయిన్గా నటించింది. ఇక తమిళ్ వెర్షన్‌కు పీ.ఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Also Read:
అక్షయ్‌కు ప్రత్యర్థిగా ‘గబ్బర్ సింగ్’ యాక్టర్.. అధికారికంగా ప్రకటించిన ‘బచ్చన్ పాండే’ యూనిట్..