అక్షయ్‏కు ప్రత్యర్థిగా ‘గబ్బర్ సింగ్’ యాక్టర్.. అధికారికంగా ప్రకటించిన ‘బచ్చన్ పాండే’ యూనిట్..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'బచ్చన్ పాండే'. ఇటీవలే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‏తో ఈ సినిమాపై

అక్షయ్‏కు ప్రత్యర్థిగా 'గబ్బర్ సింగ్' యాక్టర్.. అధికారికంగా ప్రకటించిన 'బచ్చన్ పాండే' యూనిట్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2021 | 9:38 PM

Bachchan Pandey Movie Update: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘బచ్చన్ పాండే’. ఇటీవలే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‏తో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాకు పర్హద్ సామ్ జీ డైరెక్షన్ వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ బీటౌన్‎లో హల్ చల్ చేస్తోంది.

బీహారి యాక్టర్ అభిమన్యు సింగ్.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో విలన్‏గా నటించి మంచి గుర్తింపు పొందాడు. తాజా సమాచారం ప్రకారం అభిమన్యు బచ్చన్ పాండే సినిమాలో నటిస్తున్నాడట. ఇందులో అక్షయ్ కుమార్‏కు విలన్‏గా అభిమన్యు నటించనున్నట్లు ప్రకటించారు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్. యాక్షన్ ఎంటర్ టైనర్‍గా వస్తున్న ఈ సినిమాలో అభిమన్యు ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లుగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు తరుణ్. ఇందులో కృతి సనన్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఓ నటుడు అవ్వాలకునే గ్యాంగ్ స్టర్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు.