అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి.. మరోసారి బుల్లితెరమీద సందడి చేయనున్న యంగ్ టైగర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న’ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమరం భీమ్ గా తారక్ కనిపించనున్నాడు. ఇటీవల తారక్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసాడు జక్కన. ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. హీరోగానే కాకుండా ఆమధ్య హోస్ట్ గా మారి ప్రేక్షకులను అలరించాడు తారక్. బిగ్ బాస్ సీజన్ 1 కు తారక్ హోస్ట్ గా మారి బుల్లితెరపై సందడి చేసాడు. ఆ సీజన్ కు భారీ రేటింగ్ వచ్చింది. ఆతరవాత నాని రెండో సీజన్ కు, నాగార్జున మూడు,నాలుగు సీజన్లకు హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు.
అయితే మరోసారి తారక్ ను బుల్లితెరమీద చూడాలని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మరోసారి ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేయనున్నాడట. అయితే అది బిగ్ బాస్ కోసం కాదు. ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న ఓ టాక్ షోకు తారక్ హోస్ట్ గా మారనున్నాడని అంటున్నారు. ఈ షో కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ను వేయిస్తున్నారట. మరో వైపు ఆర్ఆర్ఆర్ పూర్తైన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా మార్చిలో పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంత బిజీ షెడ్యూల్ లోను తారక్ టీవీ షో చేయడానికి సిద్ధం అవుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




