‘సలార్’పై ప్రభాస్ స్పెషల్ ఫోకస్, మిగతా ప్రాజెక్టులు కూడా సైడ్..ప్రశాంత్ నీల్ ప్లాన్ అదుర్స్
లైన్ ఉన్న సినిమాలను కూడా వెనక్కి నెట్టి సలార్‌ను పట్టాలెక్కిస్తున్నారు ప్రభాస్. హీరో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే...

లైన్ ఉన్న సినిమాలను కూడా వెనక్కి నెట్టి సలార్‌ను పట్టాలెక్కిస్తున్నారు ప్రభాస్. హీరో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే… మేకర్స్ ఇంకెంత కేర్ తీసుకోవాలి… అందుకు తగ్గట్టుగా కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తాజాగా ఈ మూవీ కాస్టింగ్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. రాధేశ్యామ్ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్.. నెక్ట్స్ ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను లైన్‌లో పెడతారనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ సినిమాలను పక్కన పెట్టేసి, సలార్‌ను ముందుకు తీసుకొచ్చారు.
జనవరి నుంచే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రజెంట్ ‘కేజీఎఫ్ 2’ షూటింగ్‌లో ఉన్న ప్రశాంత్ నీల్.. సలార్ వర్క్ కూడా కానిచ్చేస్తున్నారు. తాజాగా కాస్టింగ్ కాల్ ఇచ్చిన టీం.. ఆడిషన్స్‌లో ఆర్టిస్ట్‌లను సెలెక్ట్ చేస్తున్నారు. సపోర్టింగ్ రోల్స్‌లో కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చినా.. మెయిన్ క్యారెక్టర్స్ కు మాత్రం టాప్ స్టార్స్‌నే తీసుకుంటారన్నది కన్‌ఫార్మ్. ఇప్పటికే ప్రభాస్‌కు జోడి ఎవరు..? డార్లింగ్‌తో ఢీ అనే విలన్ ఎవరు? అన్న విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ క్వశ్చన్స్‌కు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఇంట్రస్టింగ్ ఆన్సర్స్ వినిపిస్తున్నాయి. డార్లింగ్ కమాండర్ లాంటి పాత్ర చేస్తున్నారని, కింగ్ లాంటి మరో కీ రోల్ సినిమాలో ఉందని ఇప్పటికే హింట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఆ కింగ్ లాంటి విలన్ రోల్‌లో రానా నటిస్తారన్నది టాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్.
విలన్ ఎలాగూ సౌత్ నుంచే కాబట్టి హీరోయిన్ మాత్రం నార్త్ బ్యూటీనే ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే లోఫర్ బ్యూటీ దిశా పటాని అయితే డార్లింగ్‌కు పర్ఫెక్ట్ జోడి అన్న ఆలోచనలో ఉన్నారు ప్రశాంత్ టీం. తెలుగు సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన… ఈ బ్యూటీ గ్లామర్‌కు సౌత్‌లోనూ మంచి ఫాలోయింగే ఉంది. ఇక క్యారెక్టర్ రోల్స్‌ను కూడా పాన్ ఇండియా రేంజ్‌కు తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నారు సలార్ మేకర్స్.. అందుకే ఇంపార్టెంట్ రోల్స్‌కు కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, సముద్ర ఖని లాంటి వాళ్ల పేర్లను పరిశీలిస్తున్నారట. ఇప్పటికే మల్టీ లింగ్యువల్ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న విజయ్, సముద్రఖని.. సలార్‌కు తమిళ మార్కెట్‌లో హెల్ప్ అవుతారన్నది యూనిట్ ప్లాన్. ఇంత పక్కాగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్.. సలార్‌తో కేజీఎఫ్ రికార్డ్‌లను కూడా బ్రేక్ చేస్తారేమో చూడాలి.
Also Read :
అగ్గితో ఆటలొద్దు..సీఎం మమతా బెనర్జీకు గవర్నర్ జగ్దీప్ ధనకర్ డైరెక్ట్ వార్నింగ్
రైతులకు ఆదాయం పెంచే విధానాలపై ఫోకస్ పెట్టండి, బ్యాంకర్లకు సీఎం జగన్ సూచన




