BREAKING: ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ..
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. మరికాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులతో పాటు రాజకీయాంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్న కేసీఆర్ తొలుత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో బేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, ప్రాజెక్టులు, తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, షెకావత్‌తో భేటీ అనంతరం అమిత్ షాను కలవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అమిత్ షా తన నివాసానికి చేరుకోగానే ఢిల్లీలోని తన ఇంటి నుండి కేసీఆర్ బయలుదేరారు. మరికాసేపట్లో అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు.
కాగా, ఇవాళ మధ్యాహ్నం బేంగపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. మూడు రోజుల పాటు అక్కడ ఉండనున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో పాటు.. కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు వంటి అంశాలపై వారితో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులతో వరుస బిజీగా ఉన్న కేసీఆర్.. మరికాసేపట్లో హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. శనివారం నాడు పౌరవిమానయాన, హౌసింగ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.
