ఏపీలో భూముల రీ సర్వే చారిత్రాత్మక నిర్ణయం.. 2023 జూలై నాటికి పూర్తి చేస్తాం : ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
ఆంధ్రప్రదేశ్ లో భూముల రీ సర్వే చారిత్రాత్మక నిర్ణయమన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు లో సీఎం జగన్ ఈ కార్యక్రమం...

ఆంధ్రప్రదేశ్ లో భూముల రీ సర్వే చారిత్రాత్మక నిర్ణయమన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడు లో సీఎం జగన్ ఈ కార్యక్రమం ప్రారంభిస్తారని చెప్పారు. 2023 జూలై నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు. భూమి అంశంలో ఏ చిన్న సమస్య ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పుకొచ్చారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించినా ప్రైవేట్ సంస్థల వలన అది పూర్తి కాలేదని, ఈసారి తాము సర్వే ఆఫ్ ఇండియా తో కలిసి పని చేస్తున్నామని ఆయన తెలిపారు. స్థిరాస్తులు అన్ని సర్వే చేస్తామని, గ్రామ సచివాలయాల్లో ఈ భూ రికార్డ్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి రైతులకు అండగా నిలుస్తామని ఆయన చెప్పారు.