Sai Pallavi: ఆమెను చూశాకే సాయి పల్లవి పాత్ర రాశా.. ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన డైరెక్టర్..
ధనుష్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన మూవీ 'ఓం'. ఈ చిత్రంలో సాయి పల్లవి పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రీలీల సైతం నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

కోలీవుడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఓం. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తుండగా ఇందులో శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇటీవల సాయి పల్లవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే సాయిపల్లవి పోషించిన పోలీస్ అధికారిణి పాత్రకు కేరళకు చెందిన పోలీస్ అధికారిణి మెరిన్ జోసెఫ్ స్ఫూర్తి అని దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి వెల్లడించారు. ఈ పాత్రలో నటించే ముందు సాయిపల్లవి స్వయంగా మెరిన్‌ను కలిశారని ఆయన తెలిపారు. పోలీస్ అధికారిణి ఎలా ఉంటారు, ఎలా వ్యవహరిస్తారు అనే విషయాలపై ఆమె నుంచి పలు సూచనలు తీసుకున్నారని చెప్పారు. సాయిపల్లవి చాలా బాగా నటించారని, ‘ఓం’లో ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.
ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీలీల మరో కథానాయికగా కనిపించనున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఆయన ఎనిమిదేళ్ల తర్వాత తమిళ సినిమాలో నటిస్తుండటం విశేషం. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించారు. సినిమా పూర్తి పేరు ‘ఓం చాప్టర్ 1: ఉదిరం – ది బ్లడ్ వుడ్’. ఇది అడవి నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామా. ఇందులో సాయిపల్లవి పాత్ర పేరు నిత్యారెడ్డి. ఆమె ఐపీఎస్ అధికారిణి. రాష్ట్ర పోలీసు శాఖలో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత సీబీఐలో అదనపు ఎస్పీగా నియమితులవుతారు. అక్కడ ‘ఆపరేషన్ ఓం’ అనే కీలక దర్యాప్తుకు నాయకత్వం వహిస్తారు. ఈ దర్యాప్తు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించినదని తెలుస్తోంది. ఈ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఇటీవల ఒక వీడియో విడుదల చేశారు. దర్శకుడు ఎక్స్‌లో దీనిని షేర్ చేస్తూ ఆమెను “నాయుడుపేట అమ్మాయి”గా పరిచయం చేశారు. సాయిపల్లవి తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించడం కూడా ఈ సినిమాకు ప్రత్యేకత.
అయితే సాయి పల్లవి పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన మెరిన్ జోసెఫ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారిణి. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆమె 188వ ర్యాంకు సాధించారు. 2019లో కొల్లం పోలీస్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆమె పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. లింగ వివక్షపై ఆమె బహిరంగంగానే గళం విప్పారు. 2016లో మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అందం ఆధారంగా ర్యాంకులు ఇస్తూ వచ్చిన ఒక పత్రికా కథనాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు.
రాజ్‌కుమార్ పెరియస్వామి, సాయిపల్లవి కలిసి పనిచేయడం ఇది రెండోసారి. వీరిద్దరూ గతంలో ‘అమరన్’ సినిమాకు కలిసి పనిచేశారు. అది పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాకు గాను రాజ్‌కుమార్ జాతీయ ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నారు. మరోవైపు సాయిపల్లవి ఇటీవలే ‘రామాయణ’లో సీత పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా నవంబర్ 5న విడుదలైంది. సీత పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రలో ఇప్పుడు ఆమె కనిపించబోతున్నారు. ‘ఓం’ చిత్రం ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా వస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
