AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాను తలపించే సైబర్ మోసం.. తండ్రి బెయిల్ కోసం హైకోర్టు వెబ్‌సైట్‌నే హ్యాక్ చేసిన ఘనుడు!

రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తన తండ్రిని తిరిగి జైలుకు వెళ్లకుండా కాపాడేందుకు ఓ ఐటీ నిపుణుడైన కుమారుడు రాజస్థాన్ హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. అంతేకాదు మూడు నకిలీ న్యాయ ఉత్తర్వులను అప్‌లోడ్ చేశాడు. ఈ ఘటన న్యాయవ్యవస్థ డిజిటల్ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

సినిమాను తలపించే సైబర్ మోసం.. తండ్రి బెయిల్ కోసం హైకోర్టు వెబ్‌సైట్‌నే హ్యాక్ చేసిన ఘనుడు!
High Court Website Hacks
Balaraju Goud
|

Updated on: Nov 13, 2026 | 9:56 AM

Share

రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తన తండ్రిని తిరిగి జైలుకు వెళ్లకుండా కాపాడేందుకు ఓ ఐటీ నిపుణుడైన కుమారుడు రాజస్థాన్ హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. అంతేకాదు మూడు నకిలీ న్యాయ ఉత్తర్వులను అప్‌లోడ్ చేశాడు. ఈ ఘటన న్యాయవ్యవస్థ డిజిటల్ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఈ కేసులో పంజాబ్‌లోని మోగా ప్రాంతానికి చెందిన కుల్విందర్ సింగ్ పనేసర్ (53), అతని కుమారుడు మన్‌ప్రీత్ సింగ్ పనేసర్ (27)లను జోధ్‌పూర్ వెస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 10న లుధియానాలో వీరిని అదుపులోకి తీసుకుని జోధ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం నవంబర్ 19 వరకు పోలీసు రిమాండ్‌లో ఉన్నారు.

8 కిలోల నల్లమందుతో తండ్రి అరెస్ట్!

పోలీసుల వివరాల ప్రకారం, శ్రీగంగానగర్ జిల్లాలోని రాజియాసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుల్విందర్ సింగ్‌పై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. సుమారు 8 కిలోల నల్లమందుతో అతడిని అరెస్టు చేశారు. అనంతరం అతనికి మధ్యంతర బెయిల్ లభించింది. జూన్ 8 వరకు బెయిల్ గడువు ఉండగా, జూన్ 9న తిరిగి జైలులో లొంగిపోవాల్సి ఉంది. అయితే అతడు గడువులోగా జైలుకు వెళ్లలేదు.

కెనడా నుంచి సైబర్ కుట్ర?

విచారణలో కుల్విందర్ కుమారుడు మన్‌ప్రీత్ ఐటీ రంగంలో పనిచేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. 2018 నుంచి కెనడాలో నివసిస్తున్న అతడు, తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాజస్థాన్ హైకోర్టు వెబ్‌సైట్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తండ్రి బెయిల్‌ను కొనసాగించేందుకు నకిలీ కోర్టు ఉత్తర్వులను రూపొందించి అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మూడు తేదీల్లో నకిలీ ఉత్తర్వులు

2026 అక్టోబర్ 12, 15, 26 తేదీలతో హైకోర్టు కోర్టు నంబర్ 12కు సంబంధించిన మూడు క్రిమినల్ మిస్లేనియస్ బెయిల్ కేసుల ఉత్తర్వులు వెబ్‌సైట్‌లో కనిపించాయి. అయితే సంబంధిత న్యాయమూర్తి అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, ఆ తేదీల్లో ఆ కేసులు విచారణకు కూడా రాలేదని గుర్తించారు. నవంబర్ 3న ఈ విషయం బయటపడటంతో హైకోర్టు యంత్రాంగం అప్రమత్తమైంది. అంతేకాకుండా, నకిలీ ఉత్తర్వుల ధృవీకరించిన ప్రతులను కింది కోర్టుల్లోనూ అసలైనవిగా సమర్పించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. న్యాయపరమైన డేటాబేస్‌లు, ఎలక్ట్రానిక్ రికార్డుల్లో అనధికారిక మార్పులు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రిజిస్ట్రార్ ఫిర్యాదుతో వెలుగులోకి కేసు

నవంబర్ 4న రాజస్థాన్ హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ కుడి భగత్సుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు ప్రారంభమైంది. పోలీస్ కమిషనర్ అన్షుమాన్ భోమియా ఆదేశాలతో సాగిన విచారణలో తండ్రీకొడుకుల పాత్ర బయటపడినట్లు పోలీసులు తెలిపారు. హైకోర్టు వెబ్‌సైట్‌లోకి ఎలా ప్రవేశించారు? లాగిన్ వ్యవస్థను దుర్వినియోగం చేశారా? ఈ కుట్రలో మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు సర్వర్లు, డిజిటల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us