AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిన్నె పెళ్లాడతా సినిమాకు ఆ అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు.. మంజు భార్గవి..

శంకరాభరణం, యమలీల, నిన్నె పెళ్లాడతా వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు నటి మంజు భార్గవి. చాలా కాలం పాటు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన ఆమె ఇప్పుడు చిత్రాలకు దూరంగా ఉంటున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మంజు భార్గవి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నిన్నె పెళ్లాడతా సినిమాకు ఆ అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు.. మంజు భార్గవి..
Manju Bhargavi
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2026 | 9:57 AM

Share

విలక్షణ నటి మంజు భార్గవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శంకరాభరణం వంటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఆమె ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో యమలీల, నిన్నే పెళ్లాడతా వంటి విజయవంతమైన చిత్రాల షూటింగ్ అనుభవాలను, దర్శకులతో తన అనుబంధాన్ని సాక్షి టీవీ ఫ్లాష్‌బ్యాక్ ద్వారా పంచుకున్నారు. 80వ దశకంలో శంకరాభరణం వంటి క్లాసిక్ చిత్రంలో నటించిన మంజు భార్గవి, సుమారు 15 సంవత్సరాల తర్వాత 1994లో విడుదలైన యమలీలతో తెలుగు పరిశ్రమలో మళ్లీ కనిపించారు. యమలీల చిత్రానికి సంబంధించి మాట్లాడుతూ, దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి తనను ప్రత్యేకంగా ఆ పాత్రకు ఎంచుకున్నారని తెలిపారు. “ఈ క్యారెక్టర్ మీరే చేయాలి, ఇంకెవరూ కాదు” అని చెప్పినప్పుడు, సబ్జెక్ట్ చాలా నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నానని మంజు భార్గవి గుర్తుచేసుకున్నారు. ఆయన కథ రాసేటప్పుడే తనను దృష్టిలో ఉంచుకున్నారని ఆమె గర్వంగా చెప్పారు. ఆ సినిమాలో తల్లి పాత్ర చాలా ముఖ్యమని, సినిమా అంతా తన పాత్ర చుట్టూనే నడుస్తుందని, చివరి వరకు తన ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని తెలిపారు. ఆలీ వంటి వారు అప్పుడు చిన్న ఆర్టిస్టులుగా ఉన్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. యమలీల భారీ సంచలన విజయం సాధించడంతో తాను చాలా గర్వపడ్డానని, మంచి సినిమా చేశాననే సంతృప్తి కలిగిందని ఆమె వివరించారు.

యమలీల తర్వాత రెండేళ్లకు, 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడతా చిత్రంతో కూడా మంజు భార్గవికి ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఈ సినిమాలో తాను ఒక కీలకమైన, కుటుంబ కథకు ముఖ్యమైన పాత్రను పోషించానని తెలిపారు. టబుతో కలిసి పనిచేయడం, ముఖ్యంగా “తిక్క వీరుడు” పాట షూటింగ్‌ను తాము చాలా ఎంజాయ్ చేశామని ఆమె వెల్లడించారు. దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీశారని, షూటింగ్ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని ఆమె అన్నారు.

నిన్నే పెళ్లాడతా షూటింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనలను గుర్తుచేసుకుంటూ, వంశీ గారు దర్శకుడిలా కాకుండా అందరితో కలిసిపోయేవారని మంజు భార్గవి పేర్కొన్నారు. యూనిట్ అంతా ఒక కుటుంబంలా ఉండేదని, హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు రైలులో అందరూ కలిసి ప్రయాణించి, కంపార్ట్‌మెంట్‌ను గోల గోల చేశారని తెలిపారు. అప్పట్లో ప్రముఖ హీరో రవితేజ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారని ఆమె స్పష్టం చేశారు. అప్పట్లో ఒక పొడవాటి అబ్బాయి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండేవాడని, ఇప్పుడు పెద్ద హీరో అయ్యారని ఆయన గురించి ప్రస్తావించారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

రవితేజ..

Manju Bhargavi, Ravi Teja

Manju Bhargavi, Ravi Teja

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us