AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’.. తెలుగులోనూ 23 వేల కోట్ల సినిమా స్ట్రీమింగ్

జులైలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే'కు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాకు రూ. 500 కోట్ల వసూళ్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

OTT Movie: ఓటీటీలో 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'.. తెలుగులోనూ 23 వేల కోట్ల సినిమా స్ట్రీమింగ్
Spiderman Brand New Day Movie
Basha Shek
|

Updated on: Nov 13, 2026 | 10:00 AM

Share

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ‘స్పైడర్-మ్యాన్’ ఫ్రాంఛైజీ సినిమాలంటే ఆ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. మన ఇండియాలోనూ స్పైడర్-మ్యాన్ సినిమాలు ఎగబడి చూస్తుంటారు ఆడియెన్స్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలకు రికార్డు కలెక్షన్లు వస్తుంటాయి. అలా స్పైడర్ మ్యాన్ సిరీస్ లోనే విడుదలైన లేటెస్ట్ విజువల్ వండర్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’. జులై 30న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఈ సినిమా అలరించింది. అంతేకాదు కలెక్షన్ల పరంగా గ్లోబల్ రికార్డులు బద్దలు కొట్టేసింది. ఓవరాల్ గా ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా బాక్సాఫీస్ దగ్గర 2.52 బిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.23 వేల కోట్లు కొల్లగొట్టడం విశేషం. తద్వారా ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇది మూడో స్థానంలో నిలిచింది. ఒక్క ఇండియాలోనే రూ.500 కోట్లకుపైగా నెట్ సాధించడం విశేషం. మార్వెల్ హీరోల క్రాస్ఓవర్‌తో ఆడియెన్స్ కు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇండియాలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 26 నుంచి ఈ విజువల్ వండర్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు రానుంది.

కాగా ఇప్పటికే ఇండియా బయట ఇతర దేశాల్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇండియాలో మాత్రం నవంబర్ 26 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుంది. అయితే మొదట కేవలం రెంటల్ బేసిస్ లేదా బై ఆప్షన్స్ విధానంలో మాత్రమే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అంటే, సాధారణంగా నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారైనా సరే, ఈ సినిమాను వీక్షించడానికి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫ్రీగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి డెస్టిన్ డేవిట్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. టామ్ హాలెండ్, జెండయా, శాడీ సింక్, మార్క్ రఫాలో, జాకబ్, జాన్ బెర్న్‌థాల్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. మార్వెల్ స్టూడియోస్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించింది. ఐఎండీబీలో నూ ఈ సినిమాకు 7.9/10 రేటింగ్ సాధించింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us