Jabardasth Rajamouli: కరోనాతో చావు అంచుల దాకా వెళ్లా.. ఆ నటుడే తిండి పెట్టి మరీ ఆదుకున్నాడు: జబర్దస్త్ రాజమౌళి
కరోనా రక్కసి కారణంగా బాగా ఇబ్బంది పడిన వారిలో జబర్దస్త్ రాజమౌళి కూడా ఉన్నాడు. అతనితో పాటు భార్య, తల్లి, పిల్లలు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో తన ఫ్యామిలీ ఏమైపోతుందోనని తెగ బాధ పడ్డాడట ఈ జబర్దస్త్ కమెడియన్.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో రాజమౌళి కూడా ఒకరు. తాగు బోతు పాత్రలు వేస్తూ పేరడీ సాంగ్స్ తో ఇతను చేసే స్కిట్స్ బుల్లితెర ఆడయెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. చాలా ఏళ్ల పాటు జబర్దస్త్ లో చేసి రాజమౌళి టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ కూడా వచ్చింది. అయితే అప్పటికే ఉన్న టీమ్ లీడర్ల కారణంగా ఆ ఛాన్స్ చేజారిందని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో వాపోయాడీ కమెడియన్. ప్రస్తుతం జబర్దస్త్ కు దూరంగా ఉన్న రాజమౌళి అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. అలాగే ఈవెంట్స్ లోనూ సందడి చేస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఇంట్రెస్టింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. కాగా ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఈ జబర్దస్త్ కమెడియన్ ను కూడా బాగా ఇబ్బంది పెట్టింది. అతనితో పాటు తల్లి, భార్య, పిల్లలు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే దేవుడి దీవెనలతో అందరూ క్షేమంగా కోలుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాజమౌళి కరోనా నాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకుని బాగా ఎమోషనల్ అయ్యాడు.
‘కరోనా వచ్చిన సమయంలో నేను చనిపోతానని భయపడ్డాను. నాతో పాటు మా అమ్మ, భార్య, పిల్లలకు, అన్న వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. దీంతో నా కుటుంబం ఏమైపోతుందోనని కుమిలిపోయాను. ఆ సమయంలో హాస్పిటల్లో చేర్చడం వలన చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అయింది. నేను చనిపోతాననే అంతా అనుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అదిరే అభి అన్నతో పాటు మరికొంత మంది జబర్దస్త్ టీమ్ సభ్యులు నాకు తోడుగా నిలిచారు. ముఖ్యంగా మ్యూజిల్ డైరెక్టర్ భోలే (బిగ్ బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్) నాకు మానసిక ధైర్యాన్న ఇచ్చారు. కొవిడ్ టైమ్ లో నాకు షుగర్ లెవల్స్ బాగా పెరిగి పోయాయి. దాంతో ఏది పడితే అది తినే పరిస్థితి లేదు. ఈ విషయం తెలుసుకున్న భోలే అన్న వాళ్ల అమ్మ గారు.. ఆయన భార్య ప్రత్యేకంగా నా కోసం వంట చేసి ఆస్పత్రికి తీసుకొచ్చేవారు. నిజం చెప్పాలంటే నా జీవితంలో కరోనా నాటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. అంత భయానకంగా గడిచాయి ఆ రోజులు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’అని రాజమౌళి ఎమోషనల్ అయ్యాడు.
తోటి జబర్దస్త్ కమెడియన్స్ తో రాజమౌళి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




