లేటెస్ట్ కుర్రాళ్ళ క్రష్ గా మారిపోయిన నయన సారిక  

Rajeev 

22 May  2026

instagram

టాలీవుడ్ లో కొత్త ముద్దుగుమ్మల హవా కనిపిస్తుంది. యంగ్ హీరోలు కొత్త హీరోయిన్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కుర్ర హీరోయిన్ నయన సారిక కూడా వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది.

యంగ్ హీరో నార్ని నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ.

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాదు నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది నయన సారిక.

ఆయ్ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం క  సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. వీటితో పాటే ఇటీవల రాకాస సినిమాలో నటించింది.

సంగీత్ శోభన్ నటించిన రాకాస సినిమా కూడా భారీ హిట్ అందుకుంది. దాంతో ఈ అమ్మడు టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయ్యింది.

ఇప్పుడు ఈ వయ్యారి భామ చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.