Suhasini: టీవీ నటి సుహాసిని సంచలన నిర్ణయం! ఇకపై సీరియల్స్‌లో కనిపించదా? ఏం జరిగిందంటే?
పలు సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా చేసి బుల్లితెరకు వచ్చేసింది సుహాసిని. పలు సూపర్ హిట్ సీరియల్స్, టీవీ షోస్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే ఇప్పుడు తన కెరీర్ కు సంబంధించి సుహాసిని ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

సాధారణంగా చాలా మంది యాక్టర్స్ సీరియల్స్ లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుని సినిమాలోకి వెళ్తుంటారు. అయితే కొంతమంది మాత్రం డిఫరెంట్ గా సినిమాలలో నటించి బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారు. నటి సుహాసిని సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. 2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది సుహాసిని. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత సుందరానికి తొందరెక్కువ, కోకిల, గుణ, ఆదివారం ఆడవాళ్లకు సెలవ, భూ కైలాస, లక్ష్మీ కల్యాణం, హైవే, పాండు రంగడు, పున్నమి నాగు, మౌనరాగం, సందడే సందడ, అడ్డా, రఫ్ తదితర తెలుగు సినిమాల్లోహీరోయిన్ గా, సహాయక నటిగా చేసందీ అందాల తార. కేవలం తెలుగులోనే కాదు కన్నడ, మలయాళం, తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. అయితే హీరోయిన్ గా రాణిస్తోన్న సమయంలో నే బుల్లితెరకు పరిచయమైంది సుహాసిని. 2010లో జెమినీ టీవీ లో వచ్చిన అపరంజి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అపరంజి, అనుబంధాలు, అష్టాచెమ్మ, శివశంకరి, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కల్యాణం, దేవత వంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం మామగారు సీరియల్స్ తో పాటు పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తోన్న సుహాసిని తన కెరీర్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
పలు సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న యాక్టర్స్ ఇప్పుడు డైరెక్టర్లుగానూ, నిర్మాతలుగానూ సత్తా చాటుతున్నారు. ఆ మధ్యన కార్తీకదీపం ఫేమ్ హీరో డాక్టర్ బాబు అలియాస్ నిరూపం పరిటాల ఈ మధ్య నిర్మాతగా మారి వరసగా సీరియల్స్ ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ లో దూసుకుపోతోన్న పొదరిల్లు సీరియల్ నిరూపం నిర్మించిందే. ఇప్పుడు డాక్టర్ బాబు బాటలోనే నడిచేందుకు రెడీ అవుతోందట సుహాసిని. ప్రస్తుతం ఒకవైపు హీరోయిన్ గా సీరియల్స్ చేస్తూనే మరోవైపు నిర్మాతగా మరి సీరియల్స్ ని తెరకెక్కిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఈమె కేవలం నిర్మాతగా మాత్రమే సీరియల్స్ ని నిర్మించాలని భావిస్తుందట. ప్రస్తుతం తన నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా సీరియల్స్ ని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే సుహాసిని క్లారిటీ ఇవ్వాల్సిందే.
సుహాసిని ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




