లక్కీ హీరోయిన్ గా మారిపోయిన సంయుక్త.. 

Rajeev 

22 May  2026

instagram

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ఆమె క్రేజీ హీరోయిన్ సంయుక్తమీనన్. తెలుగులో గోల్డెన్ బ్యూటీగా మంచి గుర్తింపు సంపాదించుకుంది సంయుక్తా మీనన్.

ఇటీవలే ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. బాలకృష్ణతో అఖండ 2 సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకుంది సంయుక్త. 

అఖండతో పాటు సంక్రాంతికి విడుదలైన నారి నారి నడుమమురారి సినిమాతో మరో హిట్ అందుకుంది. దాంతో ఈ అమ్మడు క్రేజ్ డబుల్ అయ్యింది.

ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో వరుస సినిమాలను లైనప్ చేసింది. త్వరలోనే స్వయంభు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నెట్టింట యాక్టివ్ గా ఉండే సంయుక్త తాజాగా కొన్ని క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.