చెర్రీ నటించిన ఆ హిట్ మూవీ స్టోరీ ముందు పవన్ దగ్గరకు వెళ్లిందట

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లు మంచి సాన్నిహిత్యం కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరు బాబాయి- అబ్బాయిలా కాకుండా అన్నాదమ్ముల్లా ఉంటారు.

చెర్రీ నటించిన ఆ హిట్ మూవీ స్టోరీ ముందు పవన్ దగ్గరకు వెళ్లిందట
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2020 | 6:30 PM

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లు మంచి సాన్నిహిత్యం కలిగి ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరు బాబాయి- అబ్బాయిలా కాకుండా అన్నాదమ్ముల్లా ఉంటారు. ఇదిలా ఉంటే వీరిద్దరికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే చెర్రీ నటించిన ఓ హిట్ చిత్రం ముందుగా పవన్‌ దగ్గరకు వెళ్లిందంట. అయితే ఆ మూవీని చెర్రీకి రెకమెండ్ చేశాడట పవన్‌. ఇంతకు ఆ సినిమా ఏంటంటే.. నాయక్‌.

మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం కలిగిన వివి వినాయక్‌ నాయక్ కథను ముందుగా పవన్‌కి చెప్పారట. ఈ కథ పవర్‌స్టార్‌కి నచ్చినప్పటికీ, కొన్ని కారణాల వలన ఈ మూవీలో నటించలేనని చెప్పారట. ఆ తరువాత ఈ మూవీని చెర్రీతో తీయమని పవన్ రెకమెండ్ చేశారట. ఇక వినాయక్‌కి కూడా ఈ కథకు చెర్రీ బాగా సెట్ అవుతాడని అనిపించడంతో.. వెంటనే రామ్ చరణ్‌కి చెప్పడం, అతడు ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. కాగా 2013లో విడుదలైన నాయక్‌ సినిమా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.