ఐదు భాషల్లో ఆర్జీవీ ‘మ‌ర్డ‌ర్’

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం మర్డర్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు.

ఐదు భాషల్లో ఆర్జీవీ 'మ‌ర్డ‌ర్'
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 23, 2020 | 6:50 PM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం మర్డర్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ నెల 28న ఉదయం గం.9.08ని.లకు మర్డర్‌ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్లు ఆయన వివరించారు. కాగా మిర్యాల‌గూడ ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని, వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నామని ఆర్జీవీ తెలిపారు. తెలుగు, త‌మిళం‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాషల్లో మర్డర్ విడుదల కాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మర్డర్ చిత్రాన్ని వర్మ ప్రకటించిన తరువాత ఆయనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.