డ్యాన్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న సీనియర్ నటి
నటి ప్రగతి..తెలుగు సినిమాలు చూసే అందరికీ సుపరిచితమే. అమ్మ, అక్క, వదిన లాంటి పాత్రలే కాదు..కాస్త విభిన్నత ఉన్న ఏ క్యారెక్టర్ వచ్చినా ఆమె తన ప్రతిభ చూపిస్తుంది.
నటి ప్రగతి..తెలుగు సినిమాలు చూసే అందరికీ సుపరిచితమే. అమ్మ, అక్క, వదిన లాంటి పాత్రలే కాదు..కాస్త విభిన్నత ఉన్న ఏ క్యారెక్టర్ వచ్చినా ఆమె తన ప్రతిభ చూపిస్తుంది. ఇటీవలి కాలంలో ‘ఎఫ్2’ సినిమాలో తమన్నా, మెహ్రీన్లకు తల్లిగా.. ‘ఓ బేబీ’ మూవీలో లక్ష్మీ కోడలిగా, రావు రమేష్ భార్యగా కనిపించి తన మార్క్ నచాటింది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సమయం గడుపుతోన్న ఈ సీనియర్ నటి.. లాక్‌డౌన్ సమయంలో తన కుమారుడితో కలిసి చేసిన కొన్ని నృత్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా తను డ్యాన్స్ చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్రగతి. ఆ వీడియోకు తన స్టైల్ లో కామెంట్ కూడా పెట్టింది. “చిన్ అప్ … మీరు ఇబ్బందుల్లో లేరు, విజేతలు అవ్వడానికి సిద్దంగా ఉన్నారు” అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.