కరోనాను జయించిన హీరో ధ్రువ సర్జా దంప‌తులు..

నటుడు ధ్రువ సర్జా దంప‌తులు క‌రోనాపై పోరాటం చేసి విజ‌యం సాధించారు. ఈ విషయాన్ని వారు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

కరోనాను జయించిన హీరో ధ్రువ సర్జా దంప‌తులు..
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 23, 2020 | 10:23 PM

నటుడు ధ్రువ సర్జా దంప‌తులు క‌రోనాపై పోరాటం చేసి విజ‌యం సాధించారు. ఈ విషయాన్ని వారు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. తాజాగా చేసిన టెస్టుల్లో త‌న‌తో పాటు త‌న సతీమణి ప్రేరణకు నెగిటివ్​ వచ్చినట్లు తెలిపాడు ధ్రువ. క్లిష్ట స‌మయంలో త‌మ‌కు మద్దతుగా నిలిచిన కుటుంబ స‌భ్యులు స‌హా అభిమానులకు ధ‌న్యావాదాలు తెలిపాడు. అంతేకాదు వారిద్దరికీ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్​ సుర్జిత్​ పాల్​ సింగ్​, అతడి టీమ్ కు థ్యాంక్స్ చెప్పాడు. కాగా ప్ర‌ముఖ హీరో అర్జున్ స‌ర్జా మేన‌ల్లుడే ధ్రువ సర్జా.

కాగా ఇటీవ‌ల అర్జున్ కుమార్తె, నటి ఐశ్వర్య అర్జున్​ కూడా కరోనా బారిన పడ్డారు. ఐశ్వర్య ప్రస్తుతం హోమ్​ క్వారంటైన్​లో ఉండి చికిత్స పొందుతోంది. కన్నడ చిత్రం ‘పొగరు’లో హీరోగా నటించాడు ధ్రువ. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా న‌టించింది. కాగా ధ్రువ సోద‌రుడు, హీరో చిరంజీవి స‌ర్జా ఇటీవ‌ల గుండెపోటుతో ఆక‌స్మికంగా మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.