AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Movie: ‘రామాయణ’లో లక్ష్మణుడి పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

నవంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన 'రామాయణ' సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 370 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మైథలాజికల్ మూవీకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

Ramayana Movie: 'రామాయణ'లో లక్ష్మణుడి పాత్రను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Ramayana Movie
Basha Shek
|

Updated on: Nov 08, 2026 | 11:07 AM

Share

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటించిన సినిమా ‘రామాయణ’. దంగల్ ఫేమ్ నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీలో కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటించాడు. దీపావళి కానుకగా నవంబర్ 05న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కనివినీ ఎరుగని కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. హిందీ, తెలుగు భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ రామాయణ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. అలాగే ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లు వస్తున్నాయి. తెలిసిన కథే అయినా హాలీవుడ్ రేంజ్ లో వీఎఫ్ఎక్స్ ఉండడంతో పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా రామాయణ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డీఎన్ఈజీ’ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాలో రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ ల తో పాటు ఎంతో మంది స్టార్స్ వివిధ పాత్రల్లో నటించారు. సన్నీ డియోల్, శోభన, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హరీశ్‌ ఉత్తమన్‌, ఫైసల్‌ మాలిక్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కునాల్‌ కపూర్‌, ముకేశ్‌ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్‌ సచ్‌దేవ్‌, రవి దూబే, ఆదినాథ్‌ కొఠారే, నితీశ్‌ శర్మ తదితరులు ఈ మూవీలో భాగమయ్యారు.

ఇదిలా ఉంటే రామాయణ సినిమాలో లక్ష్మణుడి పాత్ర గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ పాత్రలను బాలీవుడ్ నటుడు రవి దూబే పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం రామాయణ దర్శక నిర్మాతలు టాలీవుడ్ క్రేజీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ను సంప్రదించారట. అయితే అప్పటికే నిఖిల్ స్వయంభు లాంటి పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారట. దీంతో రామాయణ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోయాడట. దీంతో మేకర్స్ రవిదూబే ను తీసుకున్నారట. ఇందులో నిజమెంతుంద తెలియదు కానీ ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

కాగా కార్తికేయ 2 సినిమాతో హీరో నిఖిల్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు. బాలీవుడ్ లోనూ ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది. ఒక వేళ నిఖిల్ రామాయణ సినిమాను చేసి ఉంటే కచ్చితంగా అతనికి ఇంకా క్రేజ్ వచ్చి ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు .మరీ ముఖ్యంగా నిఖిల్ అప్ కమింగ్ మూవీ ‘స్వయంభు’ కి బాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ అయ్యేదంటున్నారు. మరి ఇది నిజమో? అబద్దమో తెలియాలంటే హీరో నిఖిల్ స్పందించాలి.

భార్య, కుమారుడితో హీరో నిఖిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us