AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana Collections : బాక్సాఫీస్ వద్ద రామాయణ ఊచకోత.. మూడు రోజుల్లోనే కలెక్షన్ల సునామీ..

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యాష్ కాంబినేషన్‌లో నితీష్ తివారీ తెరకెక్కించిన 'రామాయణ: పార్ట్ 1' బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. మూడో రోజైన శనివారం భారీ జంప్‌ను నమోదు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా దుమ్మురేపుతుంది.

Ramayana Collections : బాక్సాఫీస్ వద్ద రామాయణ ఊచకోత.. మూడు రోజుల్లోనే కలెక్షన్ల సునామీ..
Ramayana
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2026 | 9:20 AM

Share

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన దైవిక దృశ్యకావ్యం రామాయణ: పార్ట్ 1. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సంచలనం సృష్టిస్తుంది. భారీ అంచాల మధ్య విడుదలైన ఈ సినిమా గత మూడు రోజులుగా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, రాకింగ్ స్టార్ యాష్ రావణాసురుడిగా, అలాగే బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. దీంతో రోజు రోజుకీ ఈ మూవీ వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ చిత్రం మూడో రోజైన శనివారం భారీ స్థాయిలో కలెక్షన్ల జంప్‌ను నమోదు చేసింది. శుక్రవారం కాస్త నెమ్మదించినా.. శనివారం నాటికి ఈ సినిమా వసూళ్లు దేశవ్యాప్తంగా ఏకంగా 45 శాతానికి పైగా పుంజుకున్నాయి. మూడో రోజున ఈ చిత్రం భారతదేశంలో రూ. 69.80 కోట్ల నికర వసూళ్లను సాధించడంతో, 3 రోజుల మొత్తం ఇండియా నికర కలెక్షన్లు రూ.182.70 కోట్లకు చేరుకున్నాయి. ఇండియా గ్రాస్ వసూళ్లు రూ. 218.25 కోట్లను దాటడంతో భారతదేశంలో అత్యంత వేగంగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

మరోవైపు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విదేశాలలో ఇప్పటివరకు రూ. 157.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ. 375.50 కోట్లను దాటి రికార్డు సృష్టించాయి.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

భాషల వారీగా చూస్తే, హిందీ వర్షన్ నుంచి అత్యధిక ఆదాయం లభించింది. శనివారం ఒక్క రోజే హిందీలో రూ. 53 కోట్లు వసూలు కాగా, కన్నడలో రూ. 6.30 కోట్లు, తెలుగులో రూ. 6 కోట్లు, తమిళంలో రూ. 2.50 కోట్లు సాధించింది. దాంతో 3 రోజుల్లో ఒక్క హిందీ వర్షన్ నుంచే రూ. 136 కోట్ల వసూళ్లు రావడం విశేషం. ఆదివారం కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ. 39 కోట్లకు పైగా దాటేశాయి. వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 500 కోట్ల మైలురాయిని చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us