పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ మారిందట.! మరి ఈసారైనా కన్ఫర్మా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. బాలీవుడ్ హిట్ మూవీ 'పింక్'కు ఇది రీమేక్.

పవర్ స్టార్ 'వకీల్ సాబ్' రిలీజ్ డేట్ మారిందట.! మరి ఈసారైనా కన్ఫర్మా.?
Follow us

|

Updated on: Nov 19, 2020 | 3:50 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. పవన్‌కు ఇది కంబ్యాక్ మూవీ కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాపై సరైన అప్డేట్స్ లేకపోవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్ర విడుదలపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ సీజన్‌కు విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘వకీల్ సాబ్’కు తమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: 

పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!

జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..