జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల నిర్వహణకే పెద్ద పీట వేస్తూ వస్తున్న జగన్ సర్కార్ తాజాగా మరో కొత్త పధకానికి శ్రీకారం చుట్టనుంది.

  • Ravi Kiran
  • Publish Date - 7:08 am, Thu, 19 November 20
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల నిర్వహణకే పెద్ద పీట వేస్తూ వస్తున్న జగన్ సర్కార్ తాజాగా మరో కొత్త పధకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారాలు చేసుకునేవారికి ఆర్ధిక భరోసా కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే నవంబర్ 25వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న తోడు’ పధకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఈ పధకం ద్వారా వీధుల్లో చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇక వాటికి సంబంధించిన వడ్డీని పూర్తిగా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందని జగన్ అన్నారు. ఈ పధకం కింద ఇప్పటిదాకా 6.29 లక్షల దరఖాస్తులు బ్యాంకులకు చేరాయని.. ఇంకా ఎవరైనా మిగిలిపోతే.. ఆ లబ్దిదారుల దరఖాస్తులను సైతం ఈ నెల 24వ తేదీలోగా బ్యాంకులతో అనుసంధానం చేసేలా కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.

Also Read: పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పింఛన్‌ను రెండు విడతలుగా చెల్లించేందుకు.!