కోలుకుంటున్న త‌మిళ స్టార్ హీరో అజిత్‌కు.. రిస్కీ స్టంట్స్ చేస్తుండగా ప్రమాదం

త‌మిళ స్టార్ హీరో అజిత్‌కు ప్రమాదం జరిగింది. 'వలిమై' షూటింగ్‌‌లో బైక్‌ స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అజిత్‌ చేతికి, కాళ్లకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే చికిత్స అందించారు.

  • Sanjay Kasula
  • Publish Date - 5:21 pm, Thu, 19 November 20
కోలుకుంటున్న త‌మిళ స్టార్ హీరో అజిత్‌కు.. రిస్కీ స్టంట్స్ చేస్తుండగా ప్రమాదం

Tamil Actor Ajith : త‌మిళ స్టార్ హీరో అజిత్‌కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ‘వలిమై’ షూటింగ్‌‌లో బైక్‌ స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అజిత్‌ చేతికి, కాళ్లకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే చికిత్స అందించారు. ఆ తర్వాత అజిత్‌ను హైదరాబాద్‌లోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స అందించారు. వారు చెప్పిన  ట్రీట్‌మెంట్‌‌ను కొనసాగిస్తున్నారు.

ఈ స్టంట్‌ సీన్స్‌ కోసం తన సొంత బైక్‌ను ప్రత్యేకంగా తెప్పించుకున్నారని… ఆ సీన్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బైక్ స్కిడ్ అవడంతో ప్రమాదం జరిగింది. అజిత్ కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోగాలు చేసి ప్రేక్ష‌కుల‌చే ప్ర‌శంస‌లు పొందారు. ఆయ‌న తాజాగా వాలిమై చిత్రం కోసం కొన్ని రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్రం హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. ఈ సినిమాలో డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్  చేసినట్లుగా తెలుస్తోంది. ఫ్రంట్ వీల్ గాలిలోకి లేపి సింగిల్ వీల్ మీద డ్రైవ్ చేయడం లాంటి విన్యాసాలను చేస్తున్నార‌ట‌.

అయితే అజిత్‌‌కు బైక్ రైడింగ్ అంటే మహా ప్రాణం…అందులోనూ స్పోర్ట్స్, ప్రీమియం బైకులంటే ఎంతో మక్కువ. ఆయన దగ్గర చాలా స్పోర్ట్స్ బైకులు ఉన్నాయి. రేస్ ట్రాక్‌పై ఆయన పోటీ కూడా పడ్డారు. రేసర్‌గా ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. చెన్నై రోడ్లపై అజిత్ స్పోర్ట్స్ బైక్‌లపై చక్కర్లు కొట్టిన ఎన్నో వీడియోలు, ఫొటోలు గతంలో బయటికి వచ్చాయి. అయితే, ఆయన  కరోనా వ్యాప్తి సమయంలో ఏకంగా హైదరాబాద్ నుంచి చెన్నైకి బైక్‌పై వెళ్లారు.

గ‌తంలో అజిత్- వినోద్ క‌లిసి నెర్కొండ పార‌వై సినిమాకు క‌లిసి ప‌ని చేశారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో వాలిమై మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో అజిత్ స‌ర‌స‌న హుమా ఖురేషి కథానాయిక‌గా న‌టిస్తుంది. బోని క‌పూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌కు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో అజిత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడ‌ట‌.