‘ఆచార్య’లో చెర్రీ ఎంట్రీ ఎప్పుడంటే!

'ఆచార్య'లో చెర్రీ ఎంట్రీ ఎప్పుడంటే!

మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 11, 2020 | 4:58 PM

Ram Charan entry in Acharya: మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. దాదాపు 30 నిమిషాల పాటు చెర్రీ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త తెలిసినప్పుడు మెగా ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై ఆతృత మరింత పెరిగింది. ఇదివరకే చెర్రీ నటించిన రెండు చిత్రాల్లో చిరు, కెమెరా అప్పియరెన్స్ ఇచ్చినప్పుడు, అలాగే చిరు నటించిన ఖైదీ నంబర్‌ 150లో చెర్రీ ఓ పాటలో కనిపించినప్పుడే థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. అలాంటిది ఆచార్యలో కాసేపు కలిసి నటించబోతున్నారన్న విషయం తెలిసిన ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీలో చెర్రీ ఎంట్రీ గురించిన వార్త ఒకటి ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో చెర్రీ నక్సలైట్‌ పాత్రలో కనిపించనుండగా, ఇంట్రవెల్‌ సమయంలో అతడి పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఆ ఎపిసోడ్‌ని కొరటాల భారీ ఎమోషన్‌లతో తీర్చి దిద్దబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఇందులో చిరు, చెర్రీ ఇద్దరు ఓ పాటలో కూడా మెరవనున్నట్లు టాక్‌. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఈ మూవీలో చిరు సరసన కాజల్‌ రెండోసారి జత కట్టబోతోంది. అలాగే సోనూసూద్‌, అజయ్, హిమజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: 102 రోజుల తరువాత న్యూజిలాండ్‌లో మళ్లీ ‘కరోనా’

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu