అభిమానులకు పోల్‌: ‘నిశ్శబ్దం’ను ఎక్కడ చూడాలనుకుంటున్నారు!

కరోనా నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ తెరుచుకున్నా థియేటర్లలోకి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తిని చూపడం లేదు

  • Tv9 Telugu
  • Publish Date - 5:06 pm, Tue, 11 August 20
అభిమానులకు పోల్‌: 'నిశ్శబ్దం'ను ఎక్కడ చూడాలనుకుంటున్నారు!

Poll for Nishabdham release: కరోనా నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ తెరుచుకున్నా థియేటర్లలోకి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తిని చూపడం లేదు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ఆన్‌లైన్‌లో విడుదల అవుతున్నాయి. కాగా అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా విడుదలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మూవీని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారని ఆ మధ్యన పలుమార్లు వార్తలు రాగా, దర్శకనిర్మాతలు వాటిని ఖండించారు. థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూవీని ఎక్కడ విడుదల చేయాలన్న విషయాన్ని అభిమానులకే వదిలేశారు నిర్మాత, రచయిత కోన వెంకట్‌. ఒకవేళ జనవరి లేదా ఫిబ్రవరిలో థియేటర్‌లు తెరుచుకునేవారు వెయిట్ చేయాల్సి వస్తే.. నిశ్శబ్దాన్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు అన్న ప్రశ్నను కోన వెంకట్ సంధించారు. దీనికి థియేటర్‌, ఓటీటీ, ఎక్కడైనా ఓకే అన్న మూడు ఆప్షన్‌లను ఇచ్చారు. అయితే అందులో ఇప్పటివరకు ఎక్కువ మంది ఓటీటీకే ఓటు వేశారు. మరి ఈ పోల్‌ ముగిసిన తరువాత నిశ్శబ్దం మూవీ విడుదలపై కోన వెంకట్‌ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Read This Story Also: ‘ఆచార్య’లో చెర్రీ ఎంట్రీ ఎప్పుడంటే!