జ‌గ‌ప‌తి బాబు, బాహుబ‌లి మూవీ మేక‌ర్స్ కాంబోలో వెబ్ సిరీస్‌?

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Aug 11, 2020 | 4:23 PM

మొద‌ట ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు.. ఆ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకుని విల‌న్‌గా అడుగు పెట్టాడు. అప్ప‌టివ‌ర‌కూ సెంటిమెంట్‌ని పండించిన ఈ హీరో.. ఒక్క‌సారిగా విల‌న్‌గా మారి ప్రేక్ష‌కుల‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. నంద‌మూరి బాల‌కృష్ణ నటించిన..

జ‌గ‌ప‌తి బాబు, బాహుబ‌లి మూవీ మేక‌ర్స్ కాంబోలో వెబ్ సిరీస్‌?

మొద‌ట ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు.. ఆ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకుని విల‌న్‌గా అడుగు పెట్టాడు. అప్ప‌టివ‌ర‌కూ సెంటిమెంట్‌ని పండించిన ఈ హీరో.. ఒక్క‌సారిగా విల‌న్‌గా మారి ప్రేక్ష‌కుల‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. నంద‌మూరి బాల‌కృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన‌ ఈయ‌న‌.. ఆ త‌ర్వాత ఫుల్ బిజీ తఅయిపోయాడు. వ‌రుస‌గా రంగ‌స్థ‌లం, అర‌వింద స‌మేత‌, సినిమాల్లో జ‌గ‌ప‌తి బాబు న‌ట‌న‌కు ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఇక డిజిట‌ల్ మీడియాను కూడా వ‌ద‌లకుండ‌గా వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్నాడు జ‌గ్గూ భాయ్‌.

రెండేళ్ల క్రితం గ్యాంగ్ స్ట‌ర్స్ చిత్రంలో డిజిట‌ల్ మీడియాలో అడుగు పెట్టిన జ‌గ‌ప‌తి బాబు.. మ‌రో వెబ్ సిరీస్‌తో అభిమానుల‌ను అల‌రించ‌డానికి ముందుకురాబోతున్న‌ట్లు ఓ వార్త టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. బాహుబ‌లి వంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వ‌ర్క్స్ ఈ వెబ్ సిరీస్‌ని చేసేందుకు స‌న్నాహాలు చేస్తుంద‌ట‌. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ వెబ్ సిరీస్‌..సెప్టంబ‌ర్ నుచి ఈ సిరీస్ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ట‌. కాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేంత‌వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Read More:

‘క‌రోనా’ అనుభ‌వాలు మ‌న‌కు పాఠం నేర్పాయిః సీఎం కేసీఆర్

క్షీణించిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

కోవిడ్‌తో ప్ర‌ముఖ సినీ నిర్మాత మృతి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu