AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైఎస్సార్, చంద్రబాబు చెలిమిపై సినిమా !

దివంగ‌త డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, నారా చంద్ర‌బాబునాయుడు..విభిన్న పార్టీల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసి..త‌మ మార్క్ చాటుకున్నారు.

వైఎస్సార్, చంద్రబాబు చెలిమిపై సినిమా !
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2020 | 4:50 PM

Share

A film on Chandrababu and YSR’s friendship : దివంగ‌త డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, నారా చంద్ర‌బాబునాయుడు..విభిన్న పార్టీల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసి..త‌మ మార్క్ చాటుకున్నారు. వెనుక‌బ‌డిన రాయ‌ల‌‌సీమ నుంచి ఇంచుమించు ఒకే స‌మ‌యంలో రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన ఈ ఇరువురు..రాష్ట్ర ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసి స‌త్తా చాటారు. పార్టీల సిద్దాంతాల ప‌రంగా వైరం ఉన్నా, ఇద్ద‌రి మ‌ధ్య మంచి మైత్రి కూడా ఉంది. చదువుకునే రోజుల నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్న‌ట్లు చాలామంది చెబుతుంటారు. అందుకే ఈ ఇద్ద‌రు నేత‌ల‌ స్నేహంపై ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. నూత‌న దర్శకుడు రాజ్ తెరకెక్కించనున్న ఈ మూవీని ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించిన‌ విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి నిర్మించ‌నున్నార‌ట‌. అలాగే తిరుమల రెడ్డి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక రెండు భాగాలుగా రానున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించినున్నార‌ట‌. ఇక చంద్రబాబు, వైఎస్సార్ ఇద్ద‌రు క‌లిసి పొలిటిక‌ల్ కెరీర్ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ తరపున కలిసి పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య గవర్నమెంట్‌లో చంద్రబాబు, వెఎస్సార్ ఇద్ద‌రు మంత్రులుగా ప‌నిచేశారు. బాబుకు మంత్రి పదవిరావడంలో దివంగ‌త వైఎస్సార్ కీలక పాత్ర పోషించార‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతుంటారు.

Also Read : కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం

Follow Us
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌
40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌
బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్
బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్
డెలాయిట్ ఉద్యోగం పేరుతో టెక్కీకి రూ.2 లక్షల మోసం.. అసలు కథ ఇదే!
డెలాయిట్ ఉద్యోగం పేరుతో టెక్కీకి రూ.2 లక్షల మోసం.. అసలు కథ ఇదే!
అమెరికాలో మాయమైన మహానగరం.. లండన్ కంటే గొప్పది! చివరికి మిగిలింది?
అమెరికాలో మాయమైన మహానగరం.. లండన్ కంటే గొప్పది! చివరికి మిగిలింది?
ఓటీటీలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు చూస్తే..
ఓటీటీలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు చూస్తే..
వాహనదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక 24 గంటల్లోనే..
వాహనదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక 24 గంటల్లోనే..
ఉదయం Vs సాయంత్రం.. గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?
ఉదయం Vs సాయంత్రం.. గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?
బౌలర్‌గా ధోనీ ఎంట్రీ? నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన 'తలా'
బౌలర్‌గా ధోనీ ఎంట్రీ? నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన 'తలా'
ఇంట్లో తాబేలు విగ్రహం ఉంచితే ధనం, శాంతి పెరుగుతాయా?
ఇంట్లో తాబేలు విగ్రహం ఉంచితే ధనం, శాంతి పెరుగుతాయా?