102 రోజుల తరువాత న్యూజిలాండ్‌లో మళ్లీ ‘కరోనా’

102 రోజుల తరువాత న్యూజిలాండ్‌లో స్థానిక కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆక్‌ల్యాండ్‌లోని ఓ కుటుంబంలో నలుగురికి కరోనా సోకినట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ తెలిపారు

102 రోజుల తరువాత న్యూజిలాండ్‌లో మళ్లీ 'కరోనా'
Follow us

| Edited By:

Updated on: Aug 11, 2020 | 4:00 PM

Coronacases New Zealand: 102 రోజుల తరువాత న్యూజిలాండ్‌లో స్థానిక కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆక్‌ల్యాండ్‌లోని ఓ కుటుంబంలో నలుగురికి కరోనా సోకినట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ తెలిపారు. వారికి ఈ వైరస్ ఎలా సోకిందో అర్థం కాలేదని జెసిండా వెల్లడించారు. ”102 రోజుల తరువాత స్థానికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీన్ని అరికట్టేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం” అని జెసిండా అన్నారు. కాగా మరోవైపు ఆక్‌ల్యాండ్‌లో కరోనా కేసుల నేపథ్యంలో ఆ ప్రాంతంలోని అందరూ ఇళ్లలో ఉండేలా ప్రధాని‌ లాక్‌డౌన్‌ని విధించారు. కాగా న్యూజిలాండ్‌ కరోనాను జయించింది అనుకునే లోపు స్థానికంగా కేసులు రావడం మిగిలిన దేశాల్లో కూడా ఆందోళనకు కలిగిస్తోంది.

Read This Story Also: దయచేసి నా కొడుకు గురించి చెప్పండి: రియాకు సుశాంత్ తండ్రి మెసేజ్‌