AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోయిన్ పెళ్లి అయినప్పుడు చాలా బాధపడ్డా: బన్నీ

మనం అభిమానించే హీరో హీరోయిన్లకు కూడా ఫేవరెట్ స్టార్లు కచ్చితంగా ఉంటారు. అలా బన్నీ అభిమాన హీరోయిన్‌కి పెళ్లి అయినప్పుడు అతడు కూడా చాలా ఫీల్ అయ్యారట.

ఆ హీరోయిన్ పెళ్లి అయినప్పుడు చాలా బాధపడ్డా: బన్నీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 07, 2020 | 7:19 PM

Share

మనం అభిమానించే హీరో హీరోయిన్లకు కూడా ఫేవరెట్ స్టార్లు కచ్చితంగా ఉంటారు. అలా బన్నీ అభిమాన హీరోయిన్‌కి పెళ్లి అయినప్పుడు అతడు కూడా చాలా ఫీల్ అయ్యారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి ఏ హీరోయిన్‌ పెళ్లి జరిగినప్పుడు బన్నీ ఫీల్ అయ్యారంటే.. మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్.

ఈ విషయంపై మాట్లాడిన బన్నీ.. నా పెళ్లి అయినప్పుడు చాలా మంది అమ్మాయిలు బాధపడుతూ ఎస్సెమ్మెస్‌లూ, ఈ మెయిళ్లూ పంపారు. అభిమాన తారలకు పెళ్లి జరిగినప్పుడు ఉండే బాధ నాకు తెలుసు. ఎందుకంటే ఐశ్వర్యరాయ్ పెళ్లి అయినప్పుడు నేను చాలా బాధపడ్డా అని బన్నీ పేర్కొన్నారు. కాగా అభిషేక్‌ బచ్చన్‌ను ప్రేమించిన ఐశ్వర్య 2007లో ఆయనను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటించబోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ లుక్‌ ఫ్యాన్స్‌ తెగ ఆకట్టుకుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: రేవంత్‌పై పోసాని ఫైర్.. లంచం ఇస్తూ రెడ్‌హ్యాండ్‌గా దొరికిన వ్యక్తి అంటూ..!

Follow Us
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.