తిరువణ్ణామలై కార్తీక దీపం.. భక్తులకు అలర్ట్.. ఆ రోజు కొండపైకి అనుమతి లేదు!
Tiruvannamalai Karthigai Deepam 2026: తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నవంబర్ 24న అరుణాచల మహా కొండపై కార్తీక మహా దీపం వెలిగించనున్నారు. అయితే భారీ వర్షాల సూచన నేపథ్యంలో ఆ రోజు భక్తులు కొండపైకి ఎక్కడాన్ని అధికారులు నిషేధించారు.

Tiruvannamalai Karthigai Deepam: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ 24న అరుణాచల మహా కొండపై కార్తీక మహా దీపాన్ని వెలిగించనున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే కార్తీక మహా దీపం రోజున భక్తులకు కీలక ఆంక్ష విధించారు. ఆ రోజు అరుణాచల మహా కొండపైకి భక్తులు ఎక్కడాన్ని నిషేధించినట్లు జిల్లా కలెక్టర్ వందనా గార్గ్ వెల్లడించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె.. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో కొండ ప్రాంతంలో భక్తుల భద్రతకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్తీక మహా దీపం వెలిగించే రోజున భక్తులు కొండపైకి వెళ్లకుండా నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
కార్తీక దీపోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ పరిసరాలు, కొండ ప్రాంతంలో భద్రత, భక్తుల రద్దీ నియంత్రణ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.




